పశ్చిమగోదావరి

అన్ని పంచాయతీల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 16 : జిల్లాలోని అన్ని పంచాయతీలు అభివృద్ది పధంలో పయనించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా పంచాయితీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె సుధాకర్ అన్నారు. సోమవారం జిల్లా పంచాయతీ అధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998వ సంవత్సరంలో గ్రూప్-1లో ఎంపికై అనంతపురం, వరంగల్, కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో డిపివోగా విధులు నిర్వర్తించానన్నారు. అదే విధంగా మెదక్ జిల్లాలో డ్వామా పిడిగా, హైదరాబాద్ ఎస్‌ఎస్‌ఎ అధికారిగా కూడా విధులు నిర్వర్తించానన్నారు. ప్రస్తుతం సామర్లకోటలోని ఇటిసి వైస్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. దీని కోసం గ్రామ పంచాయతీలు స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు తమ సహకారాన్ని అందించాలని కోరారు. పన్నుల వసూళ్లలో ప్రగతి సాధిస్తామని పేర్కొన్నారు. డిపివోగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్‌కు ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు అందజేశారు.

మహావిష్ణువు అలంకారంలో చిన వెంకన్న
ద్వారకాతిరుమల, మే 16: శ్రీ భూసమేత మహా విష్ణువు అలంకారంలో చిన వెంకన్న భక్తులకు సాక్షాత్కారమిచ్చారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం రోజున శంఖ చక్ర గధాధారియై ఉభయ దేవేరులతో కొలువుదీరిన శ్రీవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెల 23వ తేదీ వరకూ జరగనున్న తిరు కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయ ముఖ మండపంలో చిన వెంకన్న రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని ఆలయ ఇవో వేండ్ర త్రినాధరావు తెలిపారు.