పశ్చిమగోదావరి

జన్మభూమి-మావూరు విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 28: జిల్లాలో మూడవ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం వచ్చే జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగుతుందని అధికారులంతా అప్రమత్తంగా వుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ఏర్పాట్లు, ఇ- ఆఫీస్, మీ-సేవా, సిఎఫ్‌ఎంఎస్, మీ-కోసం తదితర అంశాలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, 20 నాన్ నెగోషియబుల్ అంశాలపై ముఖ్యంగా ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. గ్రామాలను దత్తత తీసుకున్న పార్టనర్స్‌కు ముందుగానే సమాచారం అందించి వారు కూడా ఈ గ్రామసభల్లో పాల్గొనేలాచేసి వారి సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పధకాలు అమలు తీరుపై గ్రామసభల్లో చర్చించడం జరుగుతుందని చెప్పారు. పెన్షన్లు, బ్యాంకు లింకేజ్, స్ర్తినిధి పధకాలకు సంబంధించి చెక్కుల పంపిణీ, డిజిటల్ లిటరసీ ఎన్‌రోల్‌మెంట్ సాఫ్ట్‌వేర్, సంజీవని ద్వారా ఫామ్ పాండ్స్, గుర్రపు డెక్క తొలగింపు, తదితర అంశాలపై జన్మభూమి గ్రామసభల్లో చర్చించి చర్యలు చేపడతారని చెప్పారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద రోజుకు మూడు కిలోమీటర్లు చొప్పున సిసి రోడ్లు వేయడం ద్వారా ఉపాధి పనులు కల్పించాలని పంచాయితీరాజ్ శాఖాధికారులను కలెక్టర్ సూచించారు.

అనుమతుల్లేని చేపల చెరువులు ధ్వంసం చేయాలి
ఫిషరీస డిడికి కలెక్టర్ ఆదేశం
ఏలూరు, డిసెంబర్ 28: జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చేపల చెరువులను ధ్వంసం చేయాలని ఫిషరీష్ డిప్యూటీ డైరెక్టర్ లాల్ అహ్మద్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మీ-కోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధితాధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాలకొల్లు మండలం సంగంచెరువు గ్రామానికి చెందిన గుబ్బల సత్యవతి కలెక్టరుకు వినతిపత్రం సమర్పిస్తూ సుమారు 12 ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు తవ్వడం వలన సమీపంలో ఉన్న తన 80 సెంట్ల భూమికి ఊటనీరు వచ్చి పొలం పాడై పంటలు పండడం లేదని పొలం పంటపైనే ఆధారపడి జీవిస్తున్న నాకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తవ్విన చేపల చెరువు అక్రమమని తెలిసినా ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఫిషరీస్ డిడి లాల్ అహ్మద్‌ను ప్రశ్నించారు. కమిటీ దృష్టికి తీసుకెళ్లి ధ్వంసం చేయాల్సిందిగా ఆదేశించానని అహ్మద్ సమాధానం చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీకు బాధ్యత లేదా అంటూ అక్రమ చేపల చెరువులు తవ్వకం, పంట పొలాలకు నష్టం కలిగేలా చేపల చెరువులు నిర్వహించే వారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దని ఈ విషయంపై చర్యలు తీసుకుని నివేదిక పంపాలని మత్స్యశాఖ ఉపసంచాలకులను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామానికి చెందిన కెఎవి తాయారు కలెక్టరుకు లర్జీ సమర్పిస్తూ తనకు గల 1.99 ఎకరాల భూమికి సరిహద్దులో సుమారు 30.20 ఎకరాల్లో చేపల చెరువు అని చెప్పి కొత్తగా అతి పెద్ద రొయ్యల చెరువు తవ్వుతున్నారని చెప్పారు. అందువల్ల పంట భూమిలోకి ఊట నీరు చేరి పొలం పాడే పోతోందని అంతేగాక పొలానికి చెరువుకు మధ్య ఉన్న పంట బోదెను పూడ్చి వేయడం వలన మురుగుకాల్వ పూడుకుపోయిందని విన్నవించారు. ఈ విషయంపై కూడా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిషరీష్ డిడిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జెసి-2 షరీఫ్, డిఆర్‌వో కె ప్రభాకరరావు, సిపివో కె సత్యనారాయణ, ఎజిఎం ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్‌ఇ ఇరిగేషన్ వెంకటరమణ, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జెడి వై సాయిలక్ష్మీశ్వరి, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

నీరు విడుదల చేసి పంటలు కాపాడాలని ఆందోళన
కొవ్వూరు, డిసెంబర్ 28: మండలంలోని కుమారదేవం, పైడిమెట్ట, గూటాల, వేగేశ్వరపురం గ్రామాలకు చెందిన పంపింగ్ స్కీమ్‌ల నుండి వెంటనే నీటిని విడుదలచేసి తమ పంటలను కాపాడాలని ఆయా పంపింగ్ స్కీమ్‌ల కింద ఆయకట్టు రైతులు సోమవారం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో బి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చిన హామీ మేరకు సుమారు 20వేల ఎకరాలలో వరి సాగుకు నారుమళ్లు వేసుకున్నట్టు తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం విద్యుత్ అధికారులు ఈ పంపింగ్ స్కీమ్‌లకు సంబంధించిన విద్యుత్‌ను నిలుపుదల చేయడంతో పొలాలకు నీరు రాక ఆకుమడులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. వరితోపాటు చెరకు, మొక్కజొన్న, పామాయిల్ పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. ఎటువంటి నోటీసులు లేకుండా విద్యుత్ అధికారులు విద్యుత్ నిలిపివేయడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము డెల్టాలోని రైతులకు వ్యతిరేకం కాదని, తమ పంటలు రక్షించుకునేందుకే ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి గోదావరిలోని నీటిని కృష్ణాకు తరలించడం ఎంత వరకూ సమంజసమని రైతులు ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి, పంటలకు నీరందజేయాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం వల్ల రైతులు ధర్నాకు దిగవలసి వచ్చిందన్నారు. వెంటనే పంటలకు నీరందజేయాలని డిమాండు చేశారు. అనంతరం రైతులు కొవ్వూరు మండలం ఆరికిరేవుల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద, కుమారదేవం ఎత్తిపోతల పథకం వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ముట్టడి కార్యక్రమం జరుగుతుండగా ఆరికిరేవుల గ్రామానికి చెందిన ఎం సుబ్బారావు అనే రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో రైతులు అతనికి సపర్యలు చేశారు.