పశ్చిమగోదావరి

స్వచ్ఛ్భారత్‌లో భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 26: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని విజయవాడ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ కె. సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం భీమవరం టౌన్ రైల్వేస్టేషన్‌లో రైల్వే దివస్‌లో భాగంగా రైల్వే అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి స్వచ్ఛ్భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేశాఖ ఈ రోజు నుంచి జూన్ 2వ తేదీ వరకు రైల్వే దినోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. ప్రతీ రైల్వేస్టేషన్స్‌లో ఈ దినోత్సవాలు జరుగుతాయన్నారు. తమకు సహకరిస్తున్న చెరుకువాడ రంగసాయిని ప్రత్యేకంగా అభినందించారు. భీమవరం ఎడిఎన్ సతీష్‌కుమార్ మాట్లాడారు. ముందుగా స్వచ్ఛ్భారత్ పోటీల్లో గెలుపొందిన ప్రసాద్, తాతారావు, ముసలయ్యలకు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం రైల్వే అధికారులు ప్రయాణీకులతో స్వచ్ఛ్భారత్ ప్రతిజ్ఞ చేయించారు. స్టేషన్ సిఎంఆర్‌పి గణపతిరాజు, ఎస్‌ఎస్ మధుసూదనరావు, సూపరిండెంట్ దేవదానమ్, తెలుగుయువత పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము, గంటా త్రిమూర్తులు, మైలాబత్తుల ఐజక్‌బాబు, చెల్లబోయిన సుబ్బారావు పాల్గొన్నారు.