పశ్చిమగోదావరి

రేపటి నుండి ఆటో మ్యుటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 30 : ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందించే దిశగా రెవిన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా జూన్ 1 నుండి ఆటోమ్యూటేషన్ విధానం అమల్లోకి రానున్నట్లు ఏలూరు ఆర్‌డివో తేజ్‌భరత్ చెప్పారు. స్థానిక ఆర్‌డివో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో మ్యూటేషన్ వలన భూక్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే సంబంధిత పేరు మార్పు రెవిన్యూ రికార్డుల్లో ఆన్‌లైన్ ద్వారా మార్పు చెందుతుందన్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకానికి మీ-సేవలో దరఖాస్తు చేసుకున్న పిదప 30 రోజులు గడువులోపు సంబంధిత తహశీల్దారు పరిష్కరించకపోతే దానంతట అదే పరిష్కారం అయ్యే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆటోమ్యూటేషన్ విధానం అమలుకోసం రాష్ట్రంలో ప్రత్యేక కమిటీని వేయడం జరిగిందని, అందులో ఇద్దరు ఆర్‌డివో స్థాయి అధికారులను సభ్యులుగా నియమించగా వారిలో తానొకడినని చెప్పారు. భవిష్యత్తులో ఇ-పాస్‌బుక్ టైటిల్ డీడ్ కేవలం రైతు ఇంటి వద్ద సమాచారం పెట్టుకునేందుకు ఉపయోగపడతాయని ఇకపై భూక్రయ విక్రయాలు, పేర్లు మార్పులు చేర్పులు విషయాలన్నీ ఆటో మ్యూటేషన్ ద్వారానే నిర్వహిస్తారన్నారు. ఆటోమ్యూటేషన్‌లో పొందుపరచిన వివరాలు ఆధారంగా రైతులకు పంట రుణాలు, పంట సబ్సిడీలు, కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ తదితరాలు అందుతాయన్నారు. ఈ సందర్భంగా ప్రజలు అందించిన వినతులను ఆర్‌డివో పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధితాధికారులకు ఆదేశాలు జారీచేశారు.