పశ్చిమగోదావరి

కాపులను బిసిల్లో చేర్చడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 30: రాష్ట్రంలో కాపులను బిసిల్లో చేర్చడం ఖాయమని, దీని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని టిడిపి నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముద్రగడ పద్మనాభం గ్రహించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2004 ఎన్నికల సమయంలో వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లోని కాపు నాయకులను ఢిల్లీ తీసుకువెళ్లి బిసిల్లో చేరుస్తామని సోనియా గాంధీతో హామీ ఇప్పించినా ఫలితం లేదన్నారు. 1994లో దీనిపై జీవో వచ్చినా ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. ఇక 1999 నుంచి 2004 సంవత్సరం వరకు టిడిపి ఎంపిగా వున్న ముద్రగడ పద్మనాభం ఆ సమయంలో కాపుల రిజర్వేషన్లపై ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట తప్పినప్పుడు ప్రశ్నించిన ముద్రగడ ఇప్పుడు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఇప్పటికే టిడిపి ప్రభుత్వం కాపుల అభివృద్ధి కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి 1100 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించిందని చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం ఈ రిజర్వేషన్ల కోసం ఏనాడు పనిచేయని రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి వంటి నాయకులను కలవడం, వారితో చేతులు కలపడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాపుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలి తప్ప రాజకీయ ప్రయోజనాలను ఆశించి పనిచేయకూడదని ఆయన హితవు పలికారు. సమావేశంలో పార్టీ నేత పాలి ప్రసాద్ పాల్గొన్నారు.