పశ్చిమగోదావరి

ఆటోను ఢీకొని బోదెలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, మే 30: ఒంటిమిట్ట రామాలయానికి వెళుతున్న ఓ టూరిస్టు బస్సు రాష్ట్రీయ రహదారిపై ఆగి ఉన్న ఒక ట్రక్కు ఆటోను ఢీకొట్టి బోదెలోకి దూసుకు వెళ్లింది. దీంతో టూరిస్టు బస్సులో ఉన్న హనుమాన్ దీక్షాధారులు, భక్తులు భయాందోళనలతో హాహాకారాలు చేశారు. మండలంలోని బుట్టాయగూడెం కాలనీ వద్ద సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం..విజయనగరానికి చెందిన ఒక టూరిస్టు బస్సు 70 మంది యాత్రీకులతో ఒంటిమిట్ట రామాలయానికి బయల్దేరి వెళుతోంది. సంఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన నిలిచి ఉన్న ట్రక్కు ఆటోను ఢీకొట్టి వేగంగా బోదెలోకి దూసుకువెళ్లింది. దీంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఈ క్రమంలో యాత్రికులు, స్థానికులు భయాందోళనతో అరుపులు కేకలు వేశారు. ఎవరికివారు కంగారుగా బస్సునుండి బయటకు దూకి రోడ్డుపైకి చేరుకున్నారు.