పశ్చిమగోదావరి

పౌష్టికాహార లోపంతో గర్భిణుల మరణాలు ఉండకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 30: జిల్లాలో పౌష్టికాహారం లోపం కారణంగా ఏ గర్భిణీ అయినా మరణిస్తే సంబంధిత ఐసిడిఎస్ సిబ్బందిని బాధ్యులను చేసి ఉద్యోగం నుండి తొలగిస్తానని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం ఐసిడిఎస్ కార్యక్రమాలను అధికారులతో ఆయన సమీక్షించారు. పోలవరం మండలం పెదరాల గ్రామానికి చెందిన అన్నికి బేబి అనే గర్భిణీ మృతి చెందడంపై కలెక్టరు స్పందిస్తూ సంబంధిత అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గర్భిణీ మృతిపై సరైన వివరణ లేకపోవటం, రికార్డుల్లో ఉన్న వివరాలకు, సిబ్బంది చెప్పిన కారణాలకు పొంతనలేకపోవటంతో పోలవరం సిడిపిఓపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిషయమై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించినట్లు తేలితే సిడిపిఓ, సూపర్‌వైజరు, అంగన్‌వాడీ వర్కర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. సిపిడిఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు పనిచేసే చోటే నివాసం ఉండాలని, ఇతర ప్రాంతాల నుండి విధులు నిర్వర్తించే సిబ్బందిని వెంటనే తొలగించాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. జిల్లాలో పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 334 అంగన్‌వాడీ కేంద్ర భవనాలకు చేపట్టిన మరమ్మతులు రెండు వారాల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పెదపాడులో సిడిపిఓ భవన నిర్మాణ పనులను ప్రారంభించాలని రెండు నెలల నుండి ఆదేశిస్తున్నప్పటికీ ఇంకా ప్రారంభించని పంచాయితీరాజ్ పెదపాడు ఎఇని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టరు చెప్పారు. ఐసిడిఎస్ పిడి చంద్రశేఖర్, పంచాయితీరాజ్ ఎస్‌ఇ మాణిక్యం, డ్వామా పిడి వెంకటరమణ, ఎఎస్‌ఎ పిఓ బ్రహ్మనందరెడ్డి పాల్గొన్నారు.