పశ్చిమగోదావరి

ఏంచేస్తున్నారు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 30: ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకోవడమే కాకుండా అక్రమణదారుడు ఆ స్ధలాన్ని వేరొకరికి అమ్మివేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తుంటే మీరేం చేస్తున్నారని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీమన్నారాయణను కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. స్ధానిక కలెక్టరేట్‌లో సోమవారం మీకోసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టరు విజ్ఞప్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ స్ధలాల అక్రమణలపై అధికారులు ఏమాత్రం ఉపేక్షించవద్దని ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకోవడం వల్ల కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, అక్రమిత స్ధలాల్లో పక్కా భవనాలు నిర్మాణం చేసినా ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో ఉన్న రెండుఎకరాల 25సెంట్ల ఆర్‌అండ్‌బి భూమిలో కొంతభాగాన్ని ఒక వ్యక్తి అక్రమించుకోవడమే కాకుండా ఆ స్ధలాన్ని కొంతమందికి విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించారని మాటూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కలెక్టరు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ధర్మాజీగూడెం మండలం లింగపాలెం రోడ్డును అనుకుని ఉన్న అర్‌అండ్‌బి స్ధలాలను ఆక్రమించుకుని కొంతమంది పక్కా బిల్డింగులు నిర్మించారని, ఏడెనిమిది నెలలుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని, ఆక్రమణలను తొలగించటం లేదని లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన మందలపు వెంకట సుబ్బారావు ఫిర్యాదు చేశారు. వీటిపై కలెక్టరు స్పందిస్తూ ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు, విజ్ఞప్తులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలన్నారు. ఏలూరు మండలం చాటపర్రులో తనకున్న 4.45 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నానని, పక్కన ఉన్న రైతుతోపాటు మరికొంతమంది చేపల చెరువులు తవ్వుతున్నారని, ఈ కారణంగా పంటభూమి సక్రమంగా పండే అవకాశం లేదని ఈవిషయాన్ని పరిశీలించాలని మాగంటి సీతారామదాసు కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. వీటిపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డిడి రామకృష్ణంరాజును ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, జెసి-2 షరీప్, డిఆర్వో కె ప్రభాకరరావు, డిపిఓ సుధాకర్, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు, పంచాయితీరాజ్ ఎస్‌ఇ మాణిక్యం, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు, జడ్పీ సిఇఓ డి సత్యనారాయణ, సిపిఓ కె సత్యనారాయణ, డిఎస్‌ఓ కె శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.