పశ్చిమగోదావరి

బిగ్ ‘బెట్టింగ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 30: ఈ ఏడాది ఐపిఎల్-9 టోర్నీలో జరిగిన పందాలు సంగతి ఎలా ఉన్న ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు మధ్య బిగ్ బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఐపిఎల్ -9లో ఇదే పెద్ద బెట్టింగ్‌గా చెప్పవచ్చు. ఇప్పటివరకు ఈ ఐపిఎల్-9లో నష్టపోయిన పందాలరాయుళ్లు ఫైనల్ మ్యాచ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌తో నష్టపోయిన సొమ్మును తిరిగి రాబట్టుకోవడానికి వ్యూహాలు రచించి పందాలువేశారు. అయితే పందెంరాయుళ్లకు బెంగళూరు క్రీడాకారుడు క్రిస్‌గేల్ చుక్కలు చూపించాడు. మ్యాచ్ టాస్ ప్రారంభం నుండి పందాలు ఆరంభమయ్యాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోతుందని పందాలు ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు అద్భుతంగా ఆడినప్పటికీ వికెట్లు కోల్పోవడంతో పందెం రాయుళ్లు హైదరాబాద్‌పై వేసి పందాలన్నీ బెంగళూరు పైకి మార్చేశారు. ఇక అక్కడ నుండి ప్రతీ బంతి బంతికి పందాలు జరుగుతూనే ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్లు కోల్పోయిన రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరుకు 208 టార్గెట్ ఇచ్చింది. అప్పటికి కూడా పందెంరాయుళ్లు మరికొందరు బెంగళూరు పైనే ఆశలు పెట్టుకుని రెట్టింపు ఉత్సాహంతో పందాలు వేసినట్లు తెలిసింది. ఛేజింగ్‌కు వచ్చిన బెంగళూరు జట్టు ఆరంభం నుంచి అదుర్స్ అనిపించేలా బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే క్రిస్‌గేల్ సిక్సర్లతో పందాలరాయుళ్ళకు ఉత్సాహాన్ని ఇచ్చి మరింత ఎక్కువ పందాలు వేసేలా ఆశలు రేపాడు. అప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పందాలు వేసుకున్న పందాలరాయుళ్లంతా బెంగళూరుపై పందాలు పట్టారు. కానీ విరాట్‌కోహ్లీ, క్రిస్‌గేల్, డివిలియర్స్ వికెట్లు ఒక్కొక్కటిగా పడిపోవడంతో పందాలరాయుళ్ళ ఆశలు సన్నగిల్లాయి. వెంటనే తరువాత వచ్చిన షెయిన్ వాట్సన్ సిక్సర్ కొట్టి ఆశలు రేపాడు. దీంతో పందాలకు ఎటువంటి డోకా లేదని భావించిన బెట్టర్లకు చివరిలో వారి ఆశలు ఆవిరైపోయాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఐపిఎల్-9లో కప్ ఫెవరేట్‌గా బరిలో దిగిన రాయల్ ఛాలెంజ్స్ బెంగుళూరు ఓటమి చెందింది. దీంతో మెజారిటీ పందాలరాయుళ్లకు కంటనీరే మిగిలింది. ఐపిఎల్ ఆరంభం నుంచి పొగొట్టుకున్న సొమ్ముతో పాటు ఫైనల్స్‌లో కూడా వారికి చేదు అనుభవమే ఎదురైంది.