పశ్చిమగోదావరి

ఔట్ గోయింగే అన్‌లిమిటెడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 30 : ఇంతకుముందు పశ్చిమగోదావరి జిల్లాలో పోస్టింగ్ అంటే ఎగిరి గంతేసి, ఎంతంటే అంత మూల్యం చెల్లించి దక్కించుకునే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా మారిపోయింది. ఇదంతా రాజకీయ జోక్యం ఎక్కువయ్యో లేక ప్రజాప్రతినిధుల వ్యతిరేకత వల్లో అనుకుంటే పొరపాటే. పరిపాలన వ్యవహారంలో జిల్లాలో వున్న పరిస్థితులే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీనితో ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న బదిలీల అంశంలో జిల్లా నుంచి ఔట్ గోయింగ్ అధికారుల సంఖ్యే ఎక్కువ వుందంటే ఆశ్చర్యం కాదు. ఇదే సమయంలో ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న అధికారుల సంఖ్య కూడా బాగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. జిల్లాలో పరిస్థితులను పరిశీలిస్తే జిల్లా అంతా ఏకమొత్తంగా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. కిందిస్థాయిలో ప్రతిపక్ష పార్టీ వైసిపి కొన్ని స్థానాలను సాధించుకున్నా మొత్తంగా చూస్తే మాత్రం టిడిపిదే పూర్తిస్థాయి ఆధిక్యం. మరోవైపు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నుంచి అన్ని స్థాయిల్లోనూ అస్మదీయులైన అధికారులను కాపాడుకుంటే తప్పేమిటని ప్రశ్నించిన వారే. క్షేత్రస్థాయిలోనూ ఇదే పరిస్థితులు కొనసాగుతూ వచ్చాయి. ఈ విధంగా అన్ని అనుకూలమైన అంశాలు ఉన్నప్పటికీ అస్మదీయులు కూడా వేరే ప్రాంతాలను ఎంచుకోవడం ఏమిటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
ఇక గత కొద్దికాలంగా జిల్లాలో పరిపాలనా వ్యవహారాల్లో చోటు చేసుకుంటున్న మార్పులు ఇతరత్రా అంశాలను పరిశీలిస్తే ఔట్ గోయింగ్ సంఖ్య ఎందుకు అధికంగా వుందన్న అంశానికి కొన్ని కారణాలు కనిపించక మానవు. గత కొద్దికాలంలోనూ ప్రభుత్వానికి సరెండరైన అధికారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలాగే అధికారిక సమావేశాల్లోనూ, ఇతరత్రా సమీక్షల్లోనూ వీరే ప్రధాన లక్ష్యంగా నిలుస్తున్నారు. వాస్తవంగా చూస్తే జిల్లా మొత్తం దాదాపు ఏకపార్టీ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో సహజంగానే ఆ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తుంటారు. దానిలో భాగమే మండల స్థాయి అధికారులు, జిల్లాస్థాయి అధికారులపై ఈ విధమైన ఒత్తిళ్లు, జోక్యాలు ఉండక తప్పని పరిస్థితే నెలకొంది. పథకాల అమలులో తమవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ నేతలు దూకుడుగా ముందుకు వెళ్లడం కూడా సాధారణమే.
క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులుంటే మరోవైపు పరిపాలనా వ్యవస్థలో నిబంధనలు, మార్గదర్శకాలు, లక్ష్యాల సాధనలు వంటివే కాకుండా మిగిలిన అన్ని నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పట్టుపడుతుండటంతో ఈ రెండింటి మధ్య అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా మారిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు రాజకీయ జోక్యానికి తలొగ్గితే ఇటు పాలనా పరంగా ఉన్నతాధికారులతో ఇబ్బందులు తప్పవు. అలా అని పాలనా పరంగా నిక్కచ్చిగా ముందుకు వెళితే మండల, జిల్లాస్థాయిల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు కొనసాగుతాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం సాధ్యం కాక ఎంతో మంది అధికారులు ఇబ్బందులు పడుతున్న దాఖలాలు వున్నాయి. అంతేకాకుండా విధి నిర్వహణలో సరైన సమర్ధత చూపడం లేదన్న అభియోగాన్ని ఎదుర్కోవడంతోపాటు కొంతమందిని ప్రభుత్వానికి సరెండర్ చేసే పరిస్థితులు కూడా తలెత్తుతుండటంతో ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పశ్చిమ పోస్టింగ్ అంటే ఉన్న డిమాండ్ ఈ నేపధ్యం కారణంగా తగ్గుముఖం పట్టడమే కాకుండా విముఖత చూపే పరిస్థితి కూడా తలెత్తుతోందని చెబుతున్నారు. ఏది ఏమైనా రానున్న బదిలీల సీజన్‌లో జిల్లాకు ఇన్‌కమింగ్ అధికారులకన్నా ఔట్ గోయింగ్ కోసం దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య అధికంగా వున్నట్లు కనిపిస్తోంది.