పశ్చిమగోదావరి

జఠాఝూటం అలంకరణకు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, మే 30: శివదేవుని చిక్కాల గ్రామంలో వేంచేసివున్న శ్రీ పార్వతీ సమేత శ్రీ శివదేవ స్వామివారికి జఠాఝూటం అలంకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం అంకురార్పణ ప్రారంభమైంది. వేద మంత్రాల నడుమ స్వామివారికి వేదపండితులు లక్ష బిల్వార్చన నిర్వహించారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక పుష్పాలను ఆలయ ప్రాంగణంలో ఉంచారు. వాటిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామివారికి అలంకరించనున్న రజిత జఠాఝూటం, నాగాభరణం, పానుపీఠం వంటి ఆభరణాలకు సుమారు 30 కిలోల వెండిని నిమ్మల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్, ధూళిపాళ సాయి శ్రీనివాస్, వసంత యామిని, ర్యాలి కృష్ణప్రసాద్ సిద్ధాంతి, వడ్డే రంగయ్యనాయుడు (పెదబాబు), పెనె్మత్స వెంకట నర్సింహవర్మ, కుక్కల నాగేంద్రప్రసాద్, వేగేశ్న కాశీవిశ్వనాథరాజు, ర్యాలి వెంకట సుబ్బారావు (కాశీ), కూనపరాజు పద్మావతి, కోట్ల రామకృష్ణ, సాయి వెంకటరాజా, సుబ్బారావు, కర్రి నరసింహారావు, గుడిసెన కోదండ రామకృష్ణ, సూర్యప్రకాశరావులు వితరణగా ఇచ్చారని ఆలయ ఇఒ సిహెచ్. వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామిజీ రాక సందర్భంగా గ్రామాన్ని కాషాయ జెండాలతో అలంకరించారు. ఉదయం 10.30 గంటలకు స్వామిజీ రానున్నారు.