పశ్చిమగోదావరి

లంచ్ బ్రేక్ అరగంట మాత్రమే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 30 : ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ బ్రేక్ అరగంట మాత్రమేనని ఇతర సమయాల్లో కార్యాలయాల సిబ్బంది విధిగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. జిల్లాలోని 82 ప్రభుత్వ శాఖలు, దాని అనుబంధ సంస్థలు విధిగా జూన్ 1వ తేదీ నుండి బయోమెట్రిక్ హాజరు అమలు చేయాల్సిందేనని ప్రభుత్వపరంగా జీతం పొందే ప్రతీ ఒక్కరూ బయోమెట్రిక్ పరిధిలోకి రావాల్సిందేనని ఇప్పటి వరకూ 62 శాఖలు బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారని, మిగిలిన 20 శాఖలు 48 గంటల్లోగా బయోమెట్రిక్ యంత్రాలను సిద్ధం చేసుకుని జూన్ 1వ తేదీ నుండి విధిగా హాజరువేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలకు తానే ఆకస్మిక తనిఖీలు చేస్తానని తాను వెళ్లిన సమయంలో సిబ్బంది హాజరు తీరును కచ్చితంగా పరిశీలిస్తానని స్పష్టంచేశారు. ప్రతీ రోజూ ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ కార్యాలయాలలో పనులు ప్రారంభం కావాలని అప్పటికే సిబ్బంది హాజరుకావాలని 1.30 గంటల వరకూ కార్యాలయంలో ఉండాలని 1.30 గంటల నుండి 2 గంటలలోపు భోజన విరామ సమయం ఉంటుందని తిరిగి 2 గంటలకు సిబ్బంది అంతా హాజరు అయి సాయంత్రం 5 గంటల వరకూ విధిగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. కొంతమంది ఉద్యోగులు ఉదయం వచ్చి బయోమెట్రిక్ హాజరు వేసి వెళ్లిపోతున్నారని, ఇష్టానుసారంగా కార్యాలయాలకు వస్తున్నట్లు తనకు సమాచారం అందిందని ప్రతీ ఆఫీసులో పనివేళల్లో క్రమశిక్షణ ఉండాలని టీ పేరుతోనో, టిఫిన్ పేరుతోనో కార్యాలయం విడిచి బయటకు వెళ్లవద్దని అవి కావాలంటే కార్యాలయానికి తెప్పించుకోవాలే తప్ప కార్యాలయం విడిచి వెళితే తగు చర్యలు తీసుకునే బాధ్యత ఆయా శాఖల ఫ్రధాన అధిపతులదేనని చెప్పారు. జూన్ 1వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లోనే ఫైల్స్ నిర్వహణ ఖచ్చితంగా అమలు చేయాలని ఈ విషయంలో రాజీ లేదని కలెక్టర్ చెప్పారు. మరో రెండు రోజుల్లో జిల్లాలో ఫైల్స్ ఆన్‌లైన్‌లో పొందుపరిచే విధానం క్రింద లక్ష ఫైళ్లు దాటనున్నాయని రాబోయే రెండు నెలల్లో పాత ఫైల్స్ అన్నీ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. నెడ్‌క్యాప్, గ్రంధాలయ సంస్థ, వయోజన విద్య, తూనికలు, కొలతలు శాఖ, గనుల శాఖలు ఆన్‌లైన్‌లో ఫైళ్లు పొందుపరిచే విధానాన్ని 24 గంటల్లోగా ప్రారంభించాలని ఆదేశించారు. త్వరలోనే ట్యాబ్‌ల ద్వారా ఇ-ఫైలింగ్ విధానాన్ని అమలు చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నామని వి ఆర్‌వో రిపోర్టులను ఆన్‌లైన్‌లో పంపించాలని ఆదేశించారు. జిల్లాలో పనిచేసే ప్రతీ వి ఆర్‌వో వారంలో అయిదు రోజులు విధిగా ఆ గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎవరైనా మండలానికి వచ్చి ఆన్‌లైన్‌లో పనులు చేస్తే కుదరదని ఏ ఉద్యోగి ఎక్కడ నుండి డేటా ఎంట్రీ చేసారో స్పష్టంగా తెలుసుకోగలుగుతామని, కావున ప్రతీ ఒక్కరూ విధి నిర్వహణలో బాధ్యతను పెంచుకోవాలని కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, డి ఆర్‌వో కె ప్రభాకరరావు, జెసి-2 షరీఫ్, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, డిపివో కె సుధాకర్, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం, ఆర్ అండ్ బి ఎస్ ఇ శ్రీమన్నారాయణ, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ అమరేశ్వరరావు, జడ్పీ సి ఇవో డి సత్యనారాయణ, సిపివో కె సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి, ఇరిగేషన్ ఎస్ ఇ వెంకటరమణ, ఫిషరీస్ డిడి రామకృష్ణంరాజు, డి ఎస్‌వో కె శివశంకరరెడ్డి పాల్గొన్నారు.