పశ్చిమగోదావరి

రాజభాషా షీల్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 30: కార్యాలయాల్లో రాజభాషను సమర్ధంగా అమలుచేస్తున్న విభాగాలకు రాజభాషా షీల్డులను సోమవారం అందజేశారు. స్ధానిక టెలికం జనరల్ మేనేజరు కార్యాలయంలో టెలికం జాయింట్ జనరల్ మేనేజరు కెఎస్‌వి ప్రసాద్ అధ్యక్షతన నగర రాజభాషా కార్యాన్వయన సమితి సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాజభాష అమలును సమీక్షించారు. 2015-16 సంవత్సరంలో రాజభాష అమలులో ప్రధమస్ధానం సాధించిన ఎస్‌బిహెచ్ రీజనల్ కార్యాలయంలో అసిస్టెంటు జనరల్ మేనేజరుగా ఉన్న ఎం తులసీదాస్‌కు ఈ షీల్డ్‌ను అందజేశారు. అలాగే ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయంలో అసిస్టెంటు జనరల్ మేనేజరుగా ఉన్న ఎం గురుమూర్తికి ద్వితీయ రాజభాషా షీల్డ్‌ను అందజేశారు. ఈసందర్భంగా హేలాపురి రాజభాష దర్పణ్ వార్షిక హిందీపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంటు కమిషనర్ టి వెంకటేశ్వరరావు, టెలికం జాయింట్ జనరల్ మేనేజర్లు ఎన్ విఠల్, దుర్గాప్రసాద్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ చంద్రవౌళి, సమితి కార్యదర్శి బి విశ్వనాధాచారి పాల్గొన్నారు.