పశ్చిమగోదావరి

సిఎం ప్రసంగం పూర్తి కాకుండానే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, జూన్ 2: మండల కేంద్రం యలమంచిలి రైతు భవనంలో గురువారం నిర్వహించిన నవనిర్మాణ దీక్ష అధికారుల కోసమేనన్నట్టు సాగింది. నవనిర్మాణ దీక్షకు అధికారులు, ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. తొలుత టివిని ఏర్పాటుచేసి సిఎం చంద్రబాబు ప్రసంగాన్ని, ప్రతిజ్ఞను వీక్షించారు. సిఎం చంద్రబాబునాయుడు ఉదయం 11 గంటలకు నవ నిర్మాణ దీక్షా ప్రతిజ్ఞను ప్రారంభించిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు నిలబడి ప్రతిజ్ఞ చేశారు. సిఎం ప్రసంగం మధ్యలోనే ఎంపిపి బొప్పన సుజాత తప్ప మిగిలిన ప్రజాప్రతినిధులందరూ ఒక్కొక్కరూ వేదికపై నుండి వెళ్లిపోయారు. మరికొద్ది సేపటికి వైద్యులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు వెళ్లిపోవడంతో సభాప్రాంగణంలో కుర్చీలు బోసిగా కనిపించాయి. సిఎం ప్రసంగం పూర్తయ్యే వరకూ అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, తహసీల్దార్ గురుప్రసాదరావు, ఎంపిడిఒ కుమార్, ఎంఇఒ రంగరాజు, ఇవో పిఆర్డీ త్రిశూలపాణి, ఎపిఎం ఆచారి, వెటర్నరీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, వసతిగృహ వార్డెన్లు, యలమంచిలి సర్పంచ్ వి లక్ష్మీనరసింహవర్మ, సొసైటీ అధ్యక్షుడు తాళ్లూరి సత్యశ్రీనివాసు, అడవిపాలెం సర్పంచ్ గోడి అశోక్‌కుమార్‌లు ఉన్నారు. మిగిలిన వారంతా ప్రసంగం పూర్తికాకుండానే వెళ్లిపోయారు.