పశ్చిమగోదావరి

రెండు రోజుల్లో 40 శాతం రేషన్ పంపిణీ:జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 2 : జిల్లాలో గత రెండు రోజుల్లో 40 శాతం మంది పేదలకు రేషన్ సరఫరా చేసి రికార్డు సృష్టించామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలోని తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో ఆయన గురువారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ మాసంలో బియ్యం, కిరోసిన్, పంచదారను ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని గత రెండు రోజుల నుండి ఇ-పాస్ విధానం ద్వారా 40 శాతం మంది పేదలకు రేషన్ అందించగలిగామని రాబోయే రెండు రోజుల్లో 50 శాతం రేషన్ అందించేందుకు నిరంతరం కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం 7 గంటల నుండే చౌక డిపోలు ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని జిల్లాలో గత నెలలో రేషన్ పంపిణీలో 93 శాతం సాధించామని త్వరలోనే నూరుశాతం రేషన్ ప్రజలకు అందించే దిశగా చౌక డిపో డీలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.