పశ్చిమగోదావరి

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, జూన్ 2: వీరవాసరం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించడంతో బుధవారం రాత్రి 11 గంటల నుండి కురిసిన వర్షంతో మండలంలోని అనేక చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. చెట్లు నేలకొరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వృక్షాలు కూలి విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. బుధవారం అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గాఢాంధకారంలో వీరవాసరం
వీరవాసరం గ్రామంలో బుధవారం రాత్రి 11 గంటల నుండి గురువారం రాత్రి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి సంభవించిన గాలివానకు వృక్షాలు, చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వీరవాసరం సబ్‌స్టేషన్ పరిధిలోని నందమూరుగరువు, వీరవాసరం, పెర్కిపాలెం తదితర ప్రాంతాల్లో భారీగా విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. తగినంత సిబ్బంది లేకపోవడంతో పునరుద్ధరణ ఆలస్యమైందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. విద్యుత్ వైర్లపై భారీ వృక్షాలు పడటంతో నష్టం భారీగా సంభవించింది. గత నెలలో కూడా ఇదే మాదిరిగా గాలివాన రావడంతో సుమారు 40 గంటలు సరఫరా నిలిచిపోయింది. వెంటనే ట్రాన్స్‌కో అధికారులు వీరవాసరం సబ్‌స్టేషన్‌కు తగినంతమంది సిబ్బందిని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.