పశ్చిమగోదావరి

అగ్రస్థానానికి అహరహం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 2: రాష్ట్రాన్ని 2029నాటికి నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరూ సహకరించాలని రాష్ట్ర గనులు, స్ర్తి,శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత కోరారు. స్ధానిక ఫైర్‌స్టేషన్ సెంటరులో గురువారం ఏర్పాటుచేసిన నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో ప్రజలతో నవనిర్మాణ దీక్షా ప్రతిజ్ఞను ఆమె చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజన పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేనంతగా అన్యాయం చేసారన్నారు. ఈదశలో ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణానికి అకుంఠిత దీక్షతో అహర్నిశలు పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి వనె్నతెచ్చే దిశగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పూర్తి అండగా నిలవాలన్నారు. అవినీతిని నిర్మూలించే సమర్ధవంతమైన నాయకుడు చంద్రబాబు అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం అర్ధికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కులమతాలకు అతీతంగా ప్రతిఒక్క పేదవానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ సమస్య పోవాలన్నా, ప్రాజెక్టు నిర్మాణాలు జరగాలన్నా ప్రత్యేక హోదా ఎంతో అవసరమని, కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలన్నారు. అన్నిరాష్ట్రాలతోపాటు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేవరకూ కేంద్రం ఉదారంగా సహకారం అందించాలని ఆమె కోరారు. కరువురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన నదుల అనుసంధానం దేశానికే ఆదర్శమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అనైతికంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పటికీ సమర్ధత గల చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి రాష్ట్భ్రావృద్ధిని ఒక సవాల్‌గా తీసుకున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా రాష్ట్ర రాజధాని రూపకల్పనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. నవనిర్మాణదీక్ష సందర్భంగా ప్రతిఒక్కరూ రాష్ట్భ్రావృద్ధికి పునరంకితం కావాలని ఆయన కోరారు. జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ప్రజల్లో ఏర్పడిన అనిశ్చిత పరిస్దితిని తొలగించి వారిలో మనోధైర్యాన్ని కల్పించే దిశగా నవనిర్మాణ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతోందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కష్టపడేతత్వం, పాలనానుభవం గల చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావటం రాష్ట్రప్రజల అదృష్టమన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలుచేస్తోందన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డిఐజి రామకృష్ణ, కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, నగర మేయర్ షేక్ నూర్జహాన్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఎంపిపి రెడ్డి అనురాధ, రెవిన్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ విద్యాసాగర్ తదితరులు ప్రసంగించారు. అనంతరం నవనిర్మాణ దీక్షపై రూపొందించిన పాటల సిడిని రాష్ట్ర మంత్రి పీతల సుజాత ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడివాడ రామచంద్రకిషోర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, విప్ గూడవల్లి శ్రీనివాస్, పలువురు కార్పోరేటర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్ధినీవిద్యార్ధులు పాల్గొన్నారు.