పశ్చిమగోదావరి

తుని ఘటనకు జగన్ మనుషులే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, జూన్ 7: ఉభయగోదావరి జిల్లాలో ఉన్న కాపులు నేర ప్రవృత్తి కలిగిన వారు కాదని, కడప నుంచి జగన్ పంపిన మనుషులే ఈ తునిలో రైలు దగ్ధం చేశారని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ నేరం రుజువు కావటంతో ఆత్మరక్షణ కోసం వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో ఆరవ రోజు నవ నిర్మాణ దీక్షా శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేర ప్రవృత్తి, మోసం, ప్రభుత్వ ఆస్తులు కాజేయటం వంటి పద్ధతులకు అలవాటు పడిన జగన్‌కు సెంట్రల్ జైలు యోగం తప్పదని ఆమె హెచ్చరించారు. రాష్ట్రం లోటు బడ్జెటులో ఉన్నప్పటికీ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. వాస్తవాలు వక్రీకరించి రాజకీయాల కోసం అల్లరి చేసి రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టులు రాకుండా చేయాలని జగన్ చేస్తున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. రాజధాని నిర్మాణం వేగవంతం చేసి అమరావతిలోనే పాలన సాగటానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పాలకొల్లు నియోజకవర్గాన్ని రామానాయుడు ఎంతో అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని, ఇప్పుడు బిసి సంక్షేమ పథకం నుండి రూ. 10 కోట్లు అదనపు గ్రాంటు వచ్చిందని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్లకు పెంచిన జీతం ఎప్పుడు ఇచ్చినా ఏప్రిల్ నుండి వచ్చేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తహసీల్దారు దాసి రాజు సంచాలకులుగా వ్యవహరించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, మున్సిపల్ ఛైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్ ఛైర్‌పర్సన్ కర్నేన రోజారమణి, మండల అధ్యక్షురాలు పెనె్మత్స శ్రీదేవి, జిల్లా సర్పంచ్ ఛాంబర్స్ అధ్యక్షులు కడలి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఆదర్శంగా పనిచేస్తున్న యలమంచిలిలంక డ్వాక్రా లీడర్ ఆదుర్తి మంగతాయారును సన్మానించారు.