పశ్చిమగోదావరి

20న సిఎంచే ‘ఏరువాక’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 16 : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20వ తేదీన జిల్లాలో ఏరువాక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో నర్సాపురం చేరుకుంటారని, అక్కడి నుంచి నర్సాపురం శివారు చిట్టవరం చేరుకుని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం విద్యుత్ పొదుపు ఫ్యాన్లను పంపిణీ చేసి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ఏరువాక ప్రారంభ కార్యక్రమం పల్లెటూరులో పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, తాగునీరు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయాలని ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇని ఆదేశించారు. బహిరంగ సభ వద్ద వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ, డి ఆర్‌డి ఏ, డ్వామా, ట్రాన్స్‌కో తదితర శాఖలు గత రెండు సంవత్సరాలుగా సాధించిన విజయాలపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. కౌలు రైతులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, జెసి-2 ఎంహెచ్ షరీఫ్, నర్సాపురం సబ్ కలెక్టర్ ఎ ఎస్ దినేష్‌కుమార్, వ్యవసాయ శాఖ జెడి సాయి లక్ష్మీశ్వరి, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ జ్ఞానేశ్వర్, ఆర్ అండ్ బి ఎస్ ఇ శ్రీమన్నారాయణ, పంచాయితీరాజ్ ఎస్ ఇ మాణిక్యం, ట్రాన్స్‌కో ఎస్ ఇ సత్యనారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్ ఇ అమరేశ్వరరావు, నెడ్‌క్యాప్ అధికారి ప్రసాద్, డి ఆర్‌డి ఏ పిడి శ్రీనివాసరావు, డ్వామా పిడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.