పశ్చిమగోదావరి

2013 భూసేకరణ చట్ట ప్రకారమే నష్టపరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, జూన్ 24: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం జరుగుతున్న భూసేకరణలో భూములిచ్చే రైతులకు 2013 భూసేకరణ చట్ట ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు కెఆర్ పురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎస్ షాన్‌మోహన్ స్పష్టం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం పిఒ షాన్‌మోహన్ రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో పిఒ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ.10.5లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతుల అంగీకారం అనంతరం పబ్లిక్‌నోటీసు జారీ, తదితర ప్రక్రియలుకు సుమారు ఆరునెలల కాలం పట్టవచ్చని అన్నారు. భూములు అప్పగించడానికి అంగీకరించిన రైతులకు భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేలోపు 12శాతం వడ్డీ గరిష్టంగా ఎకరానికి రూ.35వేలు చెల్లిస్తామని చెప్పారు. స్వాధీనం చేసిన భూముల్లో ఉన్న చెట్టు, షెడ్లు, బ్యారన్లు, బోర్లుకు రెండితల నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. బుట్టాయగూడెం, దొరమామిడి, స్వర్ణవారిగూడెం, ములగలంపల్లి, రౌతుగూడెం, పి.నారాయణపురం రైతులకు చెందిన భూములకు బుధవారంలోపు నోటీసులు జారీచేస్తామని పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో సేకరించిన సుమారు 3500 ఎకరాల భూములను వేలేరేపాడు మండల నిర్వాసితులకు కేటాయియనున్నట్లు చెప్పారు. భూసేరకణలో ఏస్థాయిలోను దళారుల ప్రమేయం లేదని, నేరుగా ఏ అసుమానం ఉన్నా తనను ఏసమయంలోనైనా కలుసుకోవచ్చని రైతులకు భరోసా ఇచ్చారు. దళారుల ప్రమేయం ఉంటే తనకు ఫిర్యాదు చేస్తే, దళారులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈసమావేశంలో రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.