పశ్చిమగోదావరి

అన్నింటికీ ఇదే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 30: మనం ఏ పనిచేసినా మనదగ్గరున్న వనరులు ఏమిటి, మన అవసరాలు ఏమిటి అన్న అంశాలపై స్పష్టత ఉంటే చేయాల్సిన కార్యక్రమం దాదాపు సగంపైన పూర్తయినట్లేనని భావించవచ్చు. వీటిపై అవగాహన లేకుండా ముందుకు కదిలి ఇబ్బందులు ఎదుర్కొవటం, లేకుంటే సులభంగా జరిగే పనిని మొత్తానికి ఇబ్బందుల్లోకి నెట్టివేయటం వంటివి ఎదురవుతాయి. ఇది సాధారణంగా ప్రతిఒక్కరికి అనుభవమే. ఇప్పుడిదే పని రాష్ట్రప్రభుత్వం చేయనుంది. అనర్హులకు కళ్లెం వేసే లక్ష్యం ప్రధానమైతే, రానున్న రోజుల్లో అమలుచేయాల్సిన పధకాలకు ఏవిధంగా రూపకల్పన చేయాలి, ఎంతమందికి ప్రభుత్వ సాయం అవసరం, రాష్ట్రప్రజల్లో ఎవరెవరు ఏ పరిస్దితుల్లో జీవిస్తున్నారు అన్న డేటా పూర్తిస్ధాయిలో సేకరించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాల పరిస్ధితి ఏమిటి, ఏ జిల్లా ఏ స్దాయిలో ఉంది, ఎలాంటి సామాజిక, ఆర్ధిక పరిస్దితులున్నాయి అన్న అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అ స్పష్టత రావాలన్నా, దాని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేయాలన్నా పూర్తిస్ధాయి సమాచారం అవసరం. ఆ సమాచారం కోసమే రాష్ట్రప్రభుత్వం ప్రజా సాధికార సర్వే అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై 6వ తేదీ నుంచి ఈ సర్వే జిల్లాలో ప్రారంభం కానుంది. ఇది 14వ తేదీ వరకు కొనసాగి ఆతర్వాత మరోసారి ఆగస్టు 5నుండి 31వరకు నిర్వహిస్తారు. ఈవిధంగా రెండువిడతలుగా పూర్తిస్ధాయిలో సమాచారాన్ని సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనినిమిత్తం ఏకంగా 2500 మంది ఎన్యూమరేటర్లను కూడా సిద్దం చేశారు. దీనిలో క్షేత్రస్ధాయిలో కీలకంగా ఉండే విఆర్వోలు, అంగన్‌వాడీ వర్కర్లతోపాటు పలువుర్ని ఎంపిక చేశారు. వీరందరికి ముందస్తుగా శిక్షణ అందించి ట్యాబ్‌లు కూడా ఇచ్చి రంగంలోకి దింపుతున్నారు.
సర్వే జరిగే విధానాన్ని చూస్తే పూర్తిస్దాయి పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగనుంది. ఒక్కొ ఎన్యూమరేటరుకు ఆ పరిధిలోని దాదాపు 650 గృహాలను కేటాయిస్తారు. వీరు తమ పరిధిలోని గృహాలకు ఒక క్రమపద్దతిలో వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. దీనిలో పలు అంశాలను పేర్కొన్నారు. ఇవన్నీ అయా కుటుంబాల సామాజిక, ఆర్దిక పరిస్దితులను తేటతెల్లం చేసేవిగా ఉన్నాయి. ప్రధానంగా ఎన్యూమరేటరు ఒక గృహానికి వెళ్లినప్పుడు ఆ గృహం చిత్రాన్ని కూడా ట్యాబ్ ద్వారా సేకరిస్తారు. ఆతర్వాత దానికి జియోటాగింగ్ చేస్తారు. అనంతరమే సమాచార సేకరణకు ఉపక్రమిస్తారు. ఇందులో దాదాపు 20 రకాల ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆధార్ కార్డుతోపాటు రేషన్‌కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఇలాంటి 20 రకాలు ఇందులో ఉన్నాయి. వీటితోపాటు అయా గృహ యజమానులకు ఉన్న అదాయ వనరులు, వస్తున్న ఆదాయం, ఉన్న వాహనాలు, ద్విచక్ర వాహనమా, ఫోర్‌వీలర్లు ఉన్నాయా ఇలాంటి అన్నిరకాల సమాచారాన్ని సేకరిస్తారు. అ యజమానిపై ఆధారపడి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, ఇంకెంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఒకవేళ చదువు మధ్యలో మానివేసినవారు ఉంటే దానికి గల కారణాలతోపాటు పలు ప్రశ్నలకు సమాధానాలను సేకరిస్తారు. వాస్తవానికి ఈవిధమైన సామాజిక, ఆర్ధిక సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పరిస్థితి పూర్తిస్థాయిలో తేటతెల్లమవుతుంది. ఎంతమంది పేదరికం దిగువన జీవిస్తున్నారు, ఇంకెంతమంది ఆధారం లేకుండా జీవిస్తున్నారు వంటి సమాచారం వెలుగుచూస్తుంది. అసలు రాష్ట్రం పరిస్ధితి ఎలాఉందన్న విషయం తెలిస్తే ఎలాంటి పధకాలు అమలుచేయాల్సిన అవసరం ఉంది, ఎవరికి ప్రభుత్వ అసరా అత్యవసరం వంటి అంశాల్లో ప్రభుత్వానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా ప్రభుత్వ పధకాల రూపకల్పన జరగడంతోపాటు ప్రస్తుతం అమలవుతున్న పధకాలన్నీ అర్హులకే అందుతున్నాయా లేదా అన్న అంశం కూడా తేటతెల్లం కానుంది. అయితే ఇంతకుముందు తెలంగాణాలో ఇలాంటి సర్వే నిర్వహించటం తెల్సిందే. అప్పట్లో అది హడావిడిగాను, ఒకరోజుకే పరిమితం కావటంతో అనుకున్న స్ధాయిలో ఫలితాలు ఇవ్వలేదన్న వాదన ఉంది. ఈనేపధ్యంలోనే రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన సర్వేను నిదానంగా, రెండువిడతల్లో నిర్వహించాలని తలపోసిందని భావిస్తున్నారు. వాస్తవ సమాచారం అందించండి
భయం అక్కర్లేదు
ప్రజా సాధికార సర్వే సందర్భంగా తమ ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించి వాస్తవ సమాచారాన్ని అందించాలని, ఈవిషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ సర్వే ఆధారంగా ఏదో జరిగిపోతుందన్న ఆందోళన అవసరం లేదని, ఎటువంటి భయం లేకుండా వాస్తవ సమాచారాన్ని అందించాలని, ఇది కేవలం భవిష్యత్ పధకాల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తారని పేర్కొన్నారు. ఈ సర్వే ఆధారంగా ప్రజల సామాజిక, ఆర్ధిక స్ధితిగతులు పూర్తిస్ధాయిలో తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ సాయం భవిష్యత్‌లో పొందాలంటే ఈ సర్వే తప్పనిసరి అన్న విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు.