పశ్చిమగోదావరి

అంతా మాయ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 2: ఆధ్యాత్మికంలో మాయ అనే పదానికి సవాలక్ష అర్ధాలున్నాయి. కానీ సామాన్య జనానికి అర్ధమయ్యే మాయ ఒకరకం. కానీ అదే రకం మాయ ఈవిభాగాన్ని పర్యవేక్షించే దేవాదాయధర్మాదాయ శాఖలో సర్వత్రా అవరించి ఉందనే చెప్పాలి. సర్వాంతర్యామిగా ఈ మాయ మారిపోవటంతో అలా ఆర్డర్లు వచ్చి, ఇలా రద్దు అయిపోయి, ఉన్నతాధికారులు హుకుంలు జారీ చేసినా దానికి భిన్నంగా అస్మదీయులకు ఆర్డర్లు రాత్రికి రాత్రి వచ్చి పడిపోతాయి. వారికి అర్హత ఉందా, లేదా అన్న అంశం కూడా పరిగణనలోకి రాదు. ఇంతటి మాయ కూడా స్వయంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సొంత జిల్లాలోనే ఆయన నియోజకవర్గానికి చుట్టుప్రక్కలే జరగటం మరో విశేషం. వాస్తవానికి దేవాదాయశాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆలయ మేనేజర్లు ఈ మొత్తం వ్యవస్ధకు మూలస్తంభాలుగా కొనసాగుతున్నారు. వీరిలో ఇఓలకు ప్రభుత్వ పద్దు ప్రకారం వేతనాలు చెల్లిస్తుండగా ఆలయ మేనేజర్లకు మాత్రం అయా ఆలయాల్లో వచ్చే ఆదాయంలోనే కేటాయిస్తుంటారు. అయితే మొత్తంగా చూస్తే ఈ రెండు ఉద్యోగ వ్యవస్ధలు ఆలయాల పైనే ఆధారపడి కొనసాగుతున్నాయని చెప్పాలి. అవిధంగా ఈవ్యవస్ధ సాగిపోతూనే ఉంది. ఈమధ్యలో అవసరానికి తగిన సంఖ్యలో ఇఓలు అందుబాటులో లేకపోవటంతో కొంతమంది మేనేజర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్నారు. ఇది స్ధూలంగా చూస్తే సహేతుకంగానే కన్పిస్తుంది. అయితే అందరి మేనేజర్లకు ఈ అదనపు బాధ్యతలు అందిరావు. ఇదే సమయంలో ఇఓలకు అదనపు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నా అక్కడ అందుబాటులో లేరన్న సూత్రాన్ని వాడేసి అస్మదీయులైన మేనేజర్లకు బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇలాంటి మాయ గత కొంతకాలంగా ఈశాఖలో సాగిపోతూనే ఉంది. జిల్లాలోనే అలాంటివి జరిగాయంటే రాష్టవ్య్రాప్తంగా ఈవిధమైన మాయ ఎన్నిచోట్ల జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక్క ఉదాహరణ చూస్తే ఈ పరిణామాలు ఇలా ఎందుకు జరుగుతున్నాయో అర్ధమవుతుంది. అలాగే పైనుంచి వచ్చిన ఆదేశాలు కూడా ఏవిధంగా బుట్టదాఖలవుతున్నాయో తేటతెల్లమవుతుంది. ఇటీవల జరిగిన దేవాదాయశాఖ బదిలీల ప్రక్రియలో పలుమార్లు చోటుచేసుకున్నాయి. అవిధంగానే కొవ్వూరులోని కొన్ని ధార్మికసంస్ధలు, అనంతపల్లి, పెద్దేవం తదితర ప్రాంతాల్లోని గ్రూప్ టెంపుల్స్ ఇఓను రాజమండ్రికి బదిలీ చేశారు. అయితే ఆయన స్ధానంలో మరొక ఇఓను కూడా ఇన్‌ఛార్జిగా నియమించారు. ఇదే సమయంలో బాధ్యతలు అప్పగించే విధానంపై ఆశాఖ కమిషనర్ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇఓలు ఉన్నచోట్ల బాధ్యతలు అప్పగించాలంటే మరొక ఇఓకు మాత్రమే అందజేయాలని, అంతకుమించి మరో ఉద్యోగికి ఈ అవకాశం ఇవ్వరాదని పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ అవిధంగానే ముందుకు సాగిపోయింది. ఈలోగా జిల్లాలో అధికారుల మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఇది సాధారణమే అన్పించినా దీనిలోనూ మరో మతలబు లేకపోలేదు. బదిలీల్లో భాగంగా కొవ్వూరు, అనంతపల్లి, పెద్దేవం గ్రూప్ టెంపుల్స్ ఇన్‌ఛార్జి ఇఓ నియామకం జరిగిపోయినా ఆతర్వాత వెనువెంటనే ఆ ఉత్తర్వు రద్దు అయిపోయింది. అలా అర్డరు ఇచ్చి ఇలా రద్దు చేశారు. అంతటితో ఊరుకోకుండా ఆ ఇన్‌ఛార్జి బాధ్యతలను కమిషనర్ ఉత్తర్వులకు భిన్నంగా మేనేజరు స్ధాయి ఉద్యోగికి అప్పగించేశారు. దీనివెనుక రాత్రికి రాత్రి ఎన్నో మంత్రాంగాలు నడిచిపోయాయని ఫలానా ఆయన ఫలానా అధికారిని కలిసి వ్యవహారం నడిపించుకోవటంతో అంతకుముందు ఇచ్చిన ఆర్డరు రద్దు అయిపోయి మరో కొత్త ఆర్డరు తెరపైకి వచ్చింది. వెనువెంటనే ఆ బాధ్యతలు స్వీకరించటం కూడా జరిగిపోయింది. అవిధంగా మొత్తానికి మాయ చేసి కమిషనర్ ఉత్తర్వులు కూడా ఆ మాయలో భాగమేనని జిల్లాలో నిరూపించగలిగారు. ఈవిధంగా ఉత్తరదక్షిణాలను బలంగా ప్రయోగించగలిగినవారికి ఇలాంటి అరుదైన అవకాశాలు లభిస్తున్నాయని, మిగిలిన వారి పరిస్దితి దారుణంగా తయారవుతోందని ఆవేదన ఆ శాఖ ఉద్యోగుల్లోనే వ్యక్తం కావటం గమనార్హం.

సోమేశ్వరాలయంలో పోటెత్తిన భ క్తులు

భీమవరం, జూలై 2: పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం శనివారం శనిత్రయోదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుఝామున నాలుగు గంటల నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి సతీష్‌కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే స్థానిక శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా శనిత్రయోదశి సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు.

విద్యతోనే సమగ్రాభివృద్ధి
మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, జూలై 2: విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న చిన్న మసీదులో శనివారం రాత్రి ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే కుటుంబ, సమాజాభివృద్ది సుసాధ్యమన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్దికి సహకరించాలన్నారు. పాఠశాలల్లో 40 మంది ముస్లిం విద్యార్థులకు ఉర్దూ ఉపాధ్యాయుడిని నియమించుకోవచ్చన్నారు. మైనార్టీ కార్పొరేషన్, ముద్ర యోజనతోపాటు సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింల ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో సమాజానికి శుభం జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ యెగ్గిన నాగబాబు, బిజెపి పట్టణాధ్యక్షుడు కర్రి ప్రభాకర బాలాజీ, నాయకులు ఖండభట్టు శ్రీనివాసరాజు, పేరిచర్ల మురళీకృష్ణంరాజు, వీరన్న నాయుడు, మసీదు నిర్వాహకులు షఫీ ఉర్ రెహ్మాన్, మహ్మద్ హఫీ, జుబేర్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీలో మంచి సంస్కరణలు
స్ర్తి శిశు సంక్షేమ, గనుల శాఖామంత్రి సుజాత

జంగారెడ్డిగూడెం, జూలై 2: ఆర్టీసీలో మంచి సంస్కరణలు తీసుకొస్తున్నామని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ, గనుల శాఖామాత్యులు పీతల సుజాత అన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో శనివారం హైదరాబాద్‌కు నూతనంగా ప్రవేశపెట్టిన రెండు ఇంద్ర ఎసి బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ఆర్టీసీలో వయోవృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 25 శాతం రాయితీ కల్పించి జూలై 1 నుండి అమల్లోకి తీసుకువచ్చామన్నారు. దేశంలోనే అత్యంత ఆధునికీకరించిన బస్టాండుగా విజయవాడ బస్టాండును అన్ని సౌకర్యాలతో పునరుద్ధరించామన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలను తలపించే విధంగా విజయవాడ బస్టాండును తీర్చిదిద్దామన్నారు. ఇదేరీతిలో విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి తదితర బస్టాండ్లను అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రయాణీకుల విజ్ఞప్తి మేరకు జంగారెడ్డిగూడెం నుండి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వరకూ రెండు ఇంద్ర బస్సులను ప్రవేశపెట్టామన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు మీదుగా విజయవాడకు సింగిల్‌స్ట్ఫా సర్వీసులను ప్రవేశపెట్టామని చెప్పారు. విశాఖపట్నంకు కూడ ఒక డీలక్స్ బస్సును తిప్పుతున్నామని, అవసరమైతే మరో బస్సును నడుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్ర బస్సును మంత్రి నడిపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జంగారెడ్డిగూడెం పాలిటెక్నిక్ కళాశాలకు స్థలం మంజూరు చేయించినందుకు మంత్రిని కళాశాల ప్రిన్సిపాల్ చలపతిరావు, అధ్యాపకులు, విద్యార్థులు మంత్రి సుజాతకు పుష్ఫగుచ్ఛం అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం ధనుంజయరావు, ఆర్డీవో ఎస్ లవన్న, ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, డిపో మేనేజర్ నాగభూషణ్, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, గంటా సుధీర్‌బాబు, ఎంపిపి కె మాణిక్యాంబ, డిఎస్పీ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.