పశ్చిమగోదావరి

ప్రజాసమస్యలపై పోరాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 11: ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నాయకులు, కార్యకర్తలకు వైసిపి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. భీమవరం నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధ్యక్షతన భీమవరం నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తల సమావేశం సోమవారం పట్టణంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని మాట్లాడుతూ వైసిపి శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించారు. ఈ రాష్ట్రప్రభుత్వం వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి స్పందిస్తేగాని స్పందించడం లేదన్నారు. గడపగడపకూ వైసిపి అనే నినాదంతో ప్రతీ గ్రామం, పట్టణంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రజలను మోసంచేస్తున్న విధానాన్ని, ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో వివరించడమే గడప గడపకూ వైసిపి లక్ష్యమని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఎల్లప్పుడు ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేయాలని జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని, అదే స్ఫూర్తితో జిల్లాలో వైసిపి పనిచేస్తోందన్నారు. తమ పార్టీ గడప గడపకూ వెళ్లిన తరువాత ఆ ఇంటి ఆడపడుచులు తమ సమస్యలను తెలియజేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజాసమస్యల కోసం పెద్దఎత్తున పోరాటం చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రజలను మోసంచేయడంలో నెంబర్ వన్ అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయకపోగా కల్లబొల్లి మాటలు చెప్పి జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేయడమేకాక కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. భీమవరం పట్టణం, భీమవరం మండలం, వీరవాసరం మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలవరం వద్ద 12 అడుగులకు చేరిన గోదావరి
పోలవరం, జూలై 11: పోలవరం గ్రామం వద్ద గోదావరి నీటి మట్టం ఉధృతంగా పెరుగుతోంది. సోమవారం ఉదయానికి గత నాలుగు రోజులుగా ఉన్న నీటి మట్టం ఉదయం నుండి క్రమేణా పెరుగుతూ 9గంటల నుండి గంటకు 60 సెంటీ మీటర్లు చొప్పున మట్టం పెరిగింది. పోలవరంలోని సిడబ్ల్యూసి కార్యాలయం వద్ద 12 అడుగులకు చేరుకోగా పట్టిసం ఎత్తిపోతల వద్ద గోదావరి నీటి మట్టం 22 మీటర్లుగా నమోదైంది. పట్టిసం వద్ద గోదావరి నది ఉధృతంగా పెరుగుతోంది. మండలంలోని పొత్తూరు కాజ్‌వేపై మధ్యాహ్నం 12 గంటల వరకూ రాకపోకలు సాధారణంగానే ఉన్నా ఆ తర్వాత 3గంటల నుండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సాయంత్రానికి పొత్తూరు కాజ్‌వేపై ఆరడగుల నీటి మట్టం ఉండడంతో 19 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. సాయంత్రం తహసీల్దార్ ఎం ముక్కంటి ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి పడవలు ఏర్పాటుచేయాలని సిబ్బందికి ఆదేశించారు. గత నాలుగు దశాబ్దాలలో నాలుగుసార్లు మాత్రమే ఇదే వేగంగా గోదావరి వరద నీటి మట్టం పెరిగిందని స్థానికులు తెలిపారు. 1986, 1996, 2006 సంవత్సరాల్లో అతి వేగంగా నీటి మట్టం పెరిగి భారీ వరదలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కుకునూరు : సోమవారం గోదావరి వరద ఉధృతి 45 అడుగులకు చేరుకోవడంతో కుకునూరు మండల రైతులు పంట పొలాలు మునిగిపోతాయేమోనని భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలో 50 అడుగులు దాటితే గోదావరి వరద పరివాహక ప్రాంతంలో వున్న పంటపొలాలు మొత్తం వరద ఉధృతికి మునిగిపోతాయని, దీనితో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పత్తి విత్తనాలు నాటి మొక్కలు వస్తున్న దశలో వరద ఉధృతి పెరుగుతుండటంతో రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు. ఇవి మునిగితే మరలా ఎకరానికి అయిదు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టి చేసుకోవాలన్నా చేతిలో పైసా కూడా లేదని, ఇప్పటి వరకు చేసిందే అప్పోసప్పో చేసి మొక్క దశకు తీసుకువస్తే ఈ దశలో వరద ఉధృతి ముంచెత్తితే మొలచిన పత్తి మొక్కలు పూర్తిగా నాశనమైపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేడు జగన్ రాక
తణుకు, జూలై 11: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉండ్రాజవరం వస్తున్నారు. ఇటీవల మృతి చెందిన ఆ పార్టీ నాయకుడు బూరుగుపల్లి చిన్నారావు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు.
తొమ్మిది మంది పేకాటరాయుళ్లు అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
తాడేపల్లిగూడెం, జూలై 11: రూరల్ మండలం ఆరుగొలను పొలంలో పేకాటాడుతున్న 9 మందిని అరెస్టుచేశారు. వీరివద్ద నుండి రూ.7,800లు నగదు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై వి చంద్రశేఖర్ సోమవారం తెలిపారు.