పశ్చిమగోదావరి

‘తాడిపూడి’ నుండి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, జూలై 14: గోదావరి నీరు వృథాగా పోతోందని వారం రోజుల ముందుగానే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన తాగునీటిని అందించేందుకు తాడిపూడి ఎత్తిపోతల పథకం నుండి నీటిని విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం మంచి ముహూర్తంగా గుర్తించి తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఇఇ ఆదిశేషయ్య మోటార్లను ఆన్ చేశారు. తాడిపూడి లిఫ్ట్‌కు సంబంధించి రెండు పంప్ హౌస్‌ల్లోను చెరొక మోటారును ప్రస్తుతం ఆన్ చేశామని, రైతుల అవసరాన్ని బట్టి లక్ష్యాల మేరకు దశలవారీగా సాగునీటిని అందిస్తామని ఆయన తెలిపారు. సాధారణంగా జూలై 20 తరువాత ఎత్తిపోతల పథకం నుండి నీటిని విడుదల చేస్తుండే వారు. అయితే వరద గోదావరి నీరు ఉందనే ఉద్దేశంతో ఈ దఫా వారం రోజుల ముందుగానే సాగునీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో డిఇ రామకోటేశ్వరరావు, ఎఇ లలిత తదితరులు ఉన్నారు.