పశ్చిమగోదావరి

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో పయనించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపురం, జూలై 18: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించాలని రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ కోడలు రూపాదేవి అన్నారు. గోపాలపురంలో కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆమె సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా రూపాదేవి మాట్లాడుతూ మహిళలు స్వశక్తిపై ఆధారపడి జీవించేందుకు ఇటువంటి శిక్షణలు ఎంతో అవసరమన్నారు. మహిళలకు ప్రభుత్వం కంప్యూటర్, కుట్టు శిక్షణ, అల్లికలు తదితర రంగాల్లో శిక్షణ ఇస్తోందని వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా చైతన్యవంతులు కావాలన్నారు. ఎంపిపి గద్దే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ శిక్షణా కేంద్రంలో ఇప్పటికి మూడు బ్యాచ్‌లుగా మహిళలకు శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం నాల్గవ బ్యాచ్ శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. వీరందరికీ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఈలి మోహినీ పద్మజారాణి, టిడిపి నేతలు గద్దే హరిబాబు, కొర్లపాటి రాము, ఈలి శరత్‌బాబు ఉన్నారు.