పశ్చిమగోదావరి

పాఠశాలల్లో నిరంతర సమగ్ర మూల్యాంకనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, జూలై 22: ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం(సిసిఇ) అమలుకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు పిలుపునిచ్చారు. స్థానిక విద్యావికాస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిరంతర సమగ్ర మూల్యాంకనంపై జరిగిన డివిజన్ స్థాయి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ విధానంలో విద్యార్థులు స్వయంగా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని, అందుకు ఉపాధ్యాయులు వారిని తయారు చేయాలని సూచించారు. ఇక నుండి 8,9,10 తరగతులకు ఎక్స్‌టర్నెల్ 80 మార్కులకు, ఇంటర్నల్ 20 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఎక్స్‌టర్నెల్ పరీక్ష విద్యార్థులు రాయాల్సి ఉంటుందని, ఇంటర్నెల్ మార్కులు విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్ట్‌లు, సమ్మెటివ్ పరీక్షల ఆధారంగా ఉపాధ్యాయులు ఇవ్వవలసి ఉంటుందని వివరించారు. వీటిపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు శుద్ధిచేసిన తాగునీరు అందించేందుకు ప్రధానోపాధ్యాయులు దాతల సహకారం తీసుకోవాలని డిఇఒ సూచించారు. అంతేగాకుండా కిచెన్ షెడ్లు, గార్డెన్స్, టాయిలెట్స్, వాటిలో రన్నింగ్ వాటర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిసిఇబి సెక్రటరీ టి.సత్యనారాయణ, డివైఇఒ మాణిక్యం తిరుమలదాసు, ఐటిడిఎ ఉప విద్యాశాఖాధికారి రామారావు, మండల విద్యాశాఖాధికారులు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు, రాముడు, శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు.