పశ్చిమగోదావరి

అధ్వాన్నంగా పుష్కర ఘాట్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి, జూలై 26: ఈ నెల 31 నుంచి గోదావరి అంత్య పుష్కరాలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో అధికారులు పుష్కర రేవులను పరిశీలిస్తున్నారు. గతేడాది పుష్కరాలకు ఏర్పాటుచేసిన పుష్కర రేవులు ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. అబ్బిరాజుపాలెంలో నిర్మించిన మరుగుదొడ్లు గత పుష్కరాలైన వెంటనే కూలిపోయాయి. మండలంలో ఉన్న పుష్కరరేవులన్నీ కూడా అధ్వాన్నస్థితిలోనే ఉన్నాయి. అబ్బిరాజుపాలెం బ్యాంకు కెనాల్‌లో ఆ గ్రామంలోని చెత్తను తీసుకువచ్చి వేస్తున్నారు. చెత్త కుండీని కాలువ గట్టపై పెట్టడంతో ఆ చెత్త అంతా కాలువలోనే వేస్తున్నారు. ఈ బ్యాంకు కెనాల్ నుంచి ప్రవహించే నీటిని లక్ష్మీపాలెం, వడ్డిలంక, శిరగారపల్లి, యలమంచిలి, బాడవ, చించినాడ, వైవి లంక గ్రామాల్లో సాగుకు వినియోగిస్తున్నారు.