పశ్చిమగోదావరి

ముంపు బాధితులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుకునూరు, జూలై 26: కుకునూరు మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన వారందరికీ ఆర్‌ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇస్తామని సబ్‌కలెక్టర్ షాన్‌మోహన్ హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరూ అపోహ పడొద్దని ఆయన కోరారు. పంట భూములు మాత్రమే మునిగి ఇళ్లు పూర్తిగా ముంపునకు గురికాకపోతే పునరావాస ప్యాకేజీ రాదని ప్రచారం జరిగిన నేపధ్యంలో బాధితులు తీవ్ర గందరగోళానికి గురై మంగళవారం ఒక్కసారిగా జరుగుతున్న సర్వేను నిలిపివేయాలని స్థానిక తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయాన్ని ముట్టడించిన నిర్వాసితులను ఉద్దేశించి సబ్‌కలెక్టరు షాన్‌మోహన్ మాట్లాడారు. భూములు మునుగుతున్నప్పుడు ఉపాధి పూర్తిగా కోల్పోతారని, అటువంటప్పుడు బాధితులందరికీ తప్పక పూర్తిస్థాయిలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందిస్తామని, ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. సబ్‌కలెక్టర్ హామీతో అప్పటివరకు ఆగ్రహంతో ఉన్న ప్రజలు సంతృప్తి చెంది వెనుదిరిగారు. అనంతరం సబ్‌కలెక్టర్ షాన్‌మోహన్ స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ప్రతి రెవెన్యూ గ్రామంలో 70 శాతానికి మించి భూములు మునిగినట్టయితే ఆయా గ్రామాల్లో నివసిస్తున్న బాధితులందరికీ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పూర్తిస్థాయిలో ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముంపునకు గురయ్యే భూముల వివరాలను ఆయన వెల్లడించారు. కుకునూరులో 2,022 ఎకరాలు, చివ్వాకలో 795, మారేడుబాకలో 611, కొండపల్లిలో 799, చీరవల్లిలో 620, మాధవరంలో 205, దామరచర్లలో 358, ఉప్పేరులో 320, అమరవరంలో 508, కోమట్లగూడెంలో 224, పెదరాయగూడెంలో 322, తొండిపాకలో 677, శ్రీ్ధర వేలేరులో 420, కౌండిన్య ముక్తిలో 277, దాసారంలో 970, ఇబ్రంపేటలో 225, గనపారంలో 348 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని మ్యాప్ ద్వారా వివరించారు. నిర్వాసితులు ఎటువంటి అపోహలు పడవద్దని, సమగ్ర సర్వే అనంతరం ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని సబ్‌లెక్టర్ షాన్‌మోహన్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం గ్రామం లాంటి ముంపునకు గురికాని గ్రామాలు కొన్ని ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని రూ.70 కోట్లతో కొత్తగా రోడ్డు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సబ్‌కలెక్టర్ తెలిపారు.