పశ్చిమగోదావరి

వనం-మనంలో పది లక్షల మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 26: వనం-మనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈనెల 29వ తేదీన పదిలక్షల మొక్కలు నాటేందుకు ఒక ప్రణాళిక అమలుచేస్తున్నట్లు కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో మంగళవారం మండలస్ధాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎక్కడా ఖాళీస్ధలం ఉంటే అక్కడ మొక్క నాటాలని, జిల్లాలో నాటే ప్రతి మొక్కకు జియోటాగింగ్ అనుసంధానం చేస్తామన్నారు. సామూహిక మొక్కలు నాటే ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని, రానున్న రెండురోజుల్లో క్షేత్రస్ధాయిలో అందరికి పూర్తిస్ధాయి అవగాహన కలిగించాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో 458 కిలోమీటర్ల పొడవునా రోడ్డు కిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని, మూడేళ్ల వరకు ఈ మొక్కలు సంరక్షించే బాధ్యతను అయా ప్రాంతాలలోని కూలీలకు అప్పగిస్తామన్నారు. ఒక్కొక్క కిలోమీటరుకు 1.50లక్షల రూపాయలు మొక్కల సంరక్షణకు ఖర్చు చేస్తామన్నారు. జిల్లాలోని 4500 పాఠశాలల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని, ముఖ్యంగా పండ్ల మొక్కలతోపాటు ఆరోగ్యాన్ని కలిగించే ఉసిరి, వేప, తులసి తదితర మొక్కలను నాటాలన్నారు. అన్నీ ప్రార్ధనామందిరాల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మొక్కల పెంపకం చేపట్టేలా అధికారులు బాధ్యత వహించాలని కలెక్టరు కోరారు. క్షేత్రస్ధాయిలో ఏవిధంగా మొక్కలు నాటాలనే అంశంపై బుధవారం ప్రతి పల్లెలో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖాధికారి ఎన్ నాగేశ్వరరావు, డ్వామా పిడి వెంకటరమణ, డిఆర్‌డిఎ పిడి కె శ్రీనివాసులు, డిఎంహెచ్‌ఓ డాక్టరు కె కోటీశ్వరి, డిపిఓ సుధాకర్, పంచాయితీరాజ్ ఎస్‌ఇ మాణిక్యం, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ నిర్మల పాల్గొన్నారు