పశ్చిమగోదావరి

వరద బాధితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, జూలై 28: ఇటీవల సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వేలేరుపాడు మండల రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సబ్ కలెక్టర్ షాన్ మోహన్ హామీ ఇచ్చారు. గురువారం మండలంలో పర్యటించి ఇసుక మేటలు వేసిన భూములను స్వయంగా చూశారు. అక్కడకు వచ్చిన రైతులనుద్దేశించి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వాగులు పొర్లి సాగు భూముల్లో ఇసుక మేటలు వేశాయన్నది గుర్తించిన ప్రభుత్వం సర్వే బృందాలు ఏర్పాటుచేసిందన్నారు. మేటలేసిన ఇసుక తీసుకునేందుకు ఐటిడిఎ తరపున ప్రతి రైతుకు ఎకరాకు రూ.1500లతోపాటు వ్యవసాయ శాఖ ద్వారా మినుము, కంది, పెసర, మొక్కజొన్న వంటి విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందిస్తామన్నారు. బాధిత రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరదల కారణంగా పెద్ద ఎత్తున ఛిద్రమైన రహదారులన్నీ ఇప్పటికే ఆర్‌అండ్‌బి, పిఆర్ శాఖల ద్వారా పునర్నిర్మించామన్నారు. పాడైన మంచినీటి పథకాలన్నీ ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ద్వారా మరమ్మతులు చేయిస్తామన్నారు. జ్వరాల నివారణకు ప్రత్యేక వైద్య బృందాల ద్వారా గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎఒ రాజారావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.