పశ్చిమగోదావరి

వనం-మనంలో నేడు పది లక్షల మొక్కలు:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా శుక్రవారం నాడు 13 జిల్లాల్లో కోటి మొక్కలను వనం-మనం కార్యక్రమంలో నాటుతున్న దృష్ట్యా పశ్చిమగోదావరి జిల్లాలో పది లక్షల మొక్కలను నాటుతున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. ఉదయం 9.30 గంటలకు సత్రంపాడు అంబికా దేవాలయం నుంచి విద్యార్ధులు, విద్యార్ధినీలు ఒక ర్యాలీగా సి ఆర్ రెడ్డి మహిళా కళాశాలకు వచ్చి మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి), ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మేయర్ షేక్ నూర్జహాన్, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్ధినీ విద్యార్ధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్ధినీ విద్యార్ధులను ఉద్దేశించి ప్రజాప్రతినిధులు, అధికారులు వనం - మనం కార్యక్రమం ముఖ్యోద్దేశ్యమును ప్రసంగిస్తారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ, డిబేట్, ఇతర పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతి ప్రదానం చేస్తారని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలను నాటాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.