పశ్చిమగోదావరి

పేద మహిళలకు ‘ఉజ్వల’ గ్యాస్ కనెక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, జూలై 28: గ్యాస్ పొయ్యి లేని పేద మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క ఆడపడుచూ వంట గ్యాస్ కనెక్షన్ లేదనకుండా అర్హత గల ప్రతి పేద మహిళకు ఉచితంగా అందిస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరూ ఈసేవ, ఇంటర్నెట్ సంబంధిత కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సిలెండర్, రెగ్యులేటర్ ఇస్తారన్నారు. గ్యాస్ స్టౌ వాయిదాలపై కొనుగోలు చేసుకునేందుకు రుణం ఇస్తామన్నారు. ఎటువంటి సిఫార్సులు లేకుండా నేరుగా గ్యాస్ కనెక్షన్ పొందవచ్చన్నారు.
రూ. 70 లక్షలతో ఏరియా ఆసుత్రి అభివృద్ధి
ఏరియా ఆస్పత్రిని రూ. 70 లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. రోగులకు వౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డయాలసిస్ రోగులకు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. శిథిలావస్థలో ముదునూరు ప్రభుత్వాసుపత్రి భవనం స్థానంలో నూతన భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. పెంటపాడు, వెంకట్రామన్నగూడెం పీహెచ్‌సీలు అభివృద్ధి చేస్తామన్నారు.
మున్సిపాల్టీలో వివిధ అభివృద్ధి పనులకు గత నెలలో రూ. 1.50 కోట్లు నిధులు విడుదలయ్యాయన్నారు. పట్టణంలో సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. నిధులు మంజూరు చేసిన మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆటోనగర్, పారిశ్రామికవాడ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
వైభవంగా కృష్ణా పుష్కరాలు
ఆగస్టు 12 నుంచి 23 వరకూ నిర్వహించే కృష్ణా పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అత్యంత ఆధునిక టెక్నాలజీ ద్వారా నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 175 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశామన్నారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో అన్ని ప్రముఖ దేవాలయాలు ఆధునీకరించామన్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. శ్రీశైలం, అమరావతి, విజయవాడ కనకదుర్గ దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. పిండ ప్రదానాలకు ప్రత్యేక ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేశామన్నారు. పురోహితులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. కృష్ణా పుష్కరాలకు 3 నుంచి 4 కోట్ల మంది పుష్కర స్నానానికి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటుచేసే బస్సులు తప్ప మరే ఇతర వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో రోజూ 15 లక్షల మందికి ఉచిత అన్నదానం అందజేస్తామన్నారు. టీటీడీ లక్ష మందికి, దేవాదాయ శాఖ లక్ష మందికి, అక్షయ ఫౌండేషన్ లక్ష మందికి, కృష్ణా జిల్లా రైస్‌మిల్లర్స్ లక్ష మందికి, ఆర్యవైశ్య సంఘం లక్ష మందికి ఉచితంగా భోజనం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టిటిడి ఆధ్వర్యంలో రూ.3.5 కోట్లతో వెంకటేశ్వర స్వామి నమూనా దేవాలయాన్ని ఏర్పాటుచేసి ఉచిత ప్రసాదం అందిస్తామన్నారు. విజయవాడ సీడబ్ల్యూసీ గొడౌన్స్‌లో నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దుర్గ గుడికి వెళ్లే రహదారిని విస్తరించామన్నారు. అమరావతి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. నిరంతరం ఆథ్మాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.
దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. దేవాలయాల్లో వైఫై సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామన్నారు. దేవాలయాలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలు, భక్తుల సంఖ్య ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు కర్రి ప్రభాకర బాలాజీ, యెగ్గిన నాగబాబు తదితరులు పాల్గొన్నారు.