పశ్చిమగోదావరి

వీరవాసరం మండలంలో స్వచ్ఛంద బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, ఆగస్టు 2: ప్రత్యేక హోదా కోసం వీరవాసరం మండలంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వీరవాసరం, నౌడూరు, రాయకుదురు గ్రామాల్లో వైసిపి నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కోటిపల్లి బాబు, మద్దాల అప్పారావు, గుండా చిన్నా, నూకల కనకరావు, గూడూరి ఓంకారం, షాలినిబాబు, మద్దాల సత్యనారాయణమూర్తి తదితరుల నాయకత్వంలో 200 మంది భారీ మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. బస్సులను నిలుపుదల చేసి ప్రయాణీకులకు ప్రత్యేక హోదా గురించి వివరించారు. బస్సులకు అడ్డుతొలగాలంటూ పోలీసులు వైసిపి నాయకులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై వైసిపి నాయకులు మద్దాల అప్పారావు మాట్లాడుతూ తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని, మమ్మల్ని ఆపడం తగదన్నారు. అయితే బస్సులను ఆపడం చట్టరీత్యా నేరమంటూ వైసిపి నాయకులను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్ళారు. మహిళా ఎంపిటిసిలు పాలా లక్ష్మీకుమారి, చికిలే మంగతాయారును పోలీసులు దౌర్జన్యంగా తోసివేశారు. అనంతరం పోలీసులు సెంటరులో ఉన్న వైసిపి నాయకులను స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా శాంతియుతంగా నాయకులు నినాదాలు చేస్తుంటే వెంటనే వెళ్లకపోతే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు తరిమేశారు.