పశ్చిమగోదావరి

శాస్త్రోక్తంగా కృష్ణా పుష్కరాల్లో పూజలు జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 4: ఈ నెలలో ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల్లో అర్చకులు భక్తులతో శాస్త్రోక్తంగా పూజలు జరిపించాలని, పిండ ప్రదానాలు జరిపించాలని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు అన్నారు. గురువారం రామచంద్రరావుపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మండపం వద్ద జిల్లాలోని అర్చకులకు కృష్ణా పుష్కరాల్లో నిర్వహించాల్సిన పద్దతులపై అవగాహనా సదస్సు నిర్వహించి గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రాఘవాచార్యులు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు జరిపించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే వసూలుచేయాలని, ఎక్కువ మొత్తంలో వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్చకులకు కేటాయించిన ఘాట్ల వద్దే వుండాలని, మరో ఘాట్‌కు వెళ్లకూడదని పేర్కొన్నారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సంస్థకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా వ్యవహరించాలన్నారు. అర్చకులు పంచ, కండువా ధరించి నుదుట బొట్టుపెట్టుకుని భక్తులతో పూజలు, పిండ ప్రదానాలు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ శాఖ కాకినాడ ఉప కమిషనర్ చందు హనుమంతరావు, సహాయ కమిషనర్ సిహెచ్ దుర్గా ప్రసాద్, సూపరింటెండెంట్ టివి ఎస్ సుబ్రహ్మణ్యం, తనిఖీదారులు కెవి అనురాధ, ప్రసాద్‌లతోపాటు ఎండోమెంట్ సిబ్బంది, అర్చకులు, దేవాలయాల ఇవోలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. అర్చకులు గుర్తింపు కార్డులు పొందేందుకు క్యూ కట్టి అసౌకర్యానికి గురయ్యారు.