పశ్చిమగోదావరి

బిసి నేతలు విశ్వసనీయత నిరూపించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, ఆగస్టు 9: రకరకాల ఉద్యమాలతో మభ్యపెడుతున్న బిసి నాయకులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర గౌడ, శెట్టిబలిజ సంఘం కార్యదర్శి, వీరవాసరం మాజీ సర్పంచ్ వీరవల్లి రామకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం కాకుండా బిసిల ప్రయోజనాల కోసం బిసి నాయకులు పనిచేయాలన్నారు. బిసివర్గాలు రిజర్వేషన్లకు ప్రశ్నార్థకం చేస్తూ వారిలో మానసిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ అశాంతికి బీజం వేసిన చంద్రబాబు నాయకత్వంలో పదవుల్లో కొనసాగుతున్న బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా టిడిపి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆర్ కృష్ణయ్య శంఖారావం పూరించడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల సందర్భంగా అమలుకు సాధ్యంకాని వాగ్దానాలు చేసి అధికారం చేపట్టి నేడు వాగ్దానాల నుంచి ఎలా బయటపడాలో అర్ధంకాక సతమతమవుతున్న చంద్రబాబు నాటకంలో భాగమే కృష్ణయ్య ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లు పొందిన అనేక కులాలను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి జాబితానుండి తొలగించినప్పుడు మాట్లాడని కృష్ణయ్య చంద్రబాబును సంక్షోభం నుంచి కాపాడటానికి ఉద్యమాన్ని తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. కృష్ణయ్య నిజంగా బిసి ప్రయోజనాలకు కృషిచేసే వ్యక్తి అయితే టిడిపి మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని హామీగా ఇచ్చిన తరువాత ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీచేసిన విషయంపై వివరణ ఇవ్వాలన్నారు. కృష్ణయ్యతో పాటు రాష్ట్ర బిసి సంఘాల నాయకులుగా చలామణిలో ఉన్న డజనుకు పైగా వివిధ నాయకులు ముందుగా చంద్రబాబు ప్రభుత్వంలోని బిసి మంత్రులతో రాజీనామా చేయించాలని రామకృష్ణ డిమాండుచేశారు. ఇక ముందు బిసిలెవరూ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిపదవి చేపట్టకుండా నిర్ణయించడం ద్వారా బిసి నాయకత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. బిసి వర్గాల్లో కొన్నింటిని ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోకి మారుస్తానని చీలిక తీసుకురావడం, ఎంబిసిల ద్వారా బిసిల్లో తిరుగుబాటుకు ఉసిగొలుపుతున్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉందన్నారు. ఏ బిసి నాయకుడైనా కాపుల్లాంటి ఇతర సామాజికవర్గంకు వ్యతిరేకంగా కాకుండా బిసిలకు అపకారం తలపెట్టిన చంద్రబాబును బిసి ద్రోహిగా ప్రకటించి ఉద్యమం కొనసాగించాల్సిందిగా వీరవల్లి డిమాండ్ చేశారు.