పశ్చిమగోదావరి

మిరప సాగుకే రైతుల మొగ్గు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, ఆగస్టు 12: సంపూర్ణ వ్యవసాయ ఆధారిత మండలమైన వేలేరుపాడులో మిరప సాగుపై రైతాంగం దృష్టిసారించారు. ఈ మండల వాతావరణానికి ప్రస్తుతం మిర్చి పంటే మేలన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం సెప్టెంబరు నెల వరకూ గోదావరి వరదలు, వాగుల భయంతో తొలకరి పంటలైన ప్రత్తి, వరి పంటలు వేసినా వాగులు, వరదల కారణంగా భారీగా నష్టపోవలసి వస్తున్నందున ఈ సంవత్సరం రైతులంతా సెప్టెంబరు నెలాఖరు నుండి మిరప పంట వేసుకోవడమే శ్రేయస్కరమనే ఆలోచనకు వచ్చారు. ఈ విధంగా ఎంత ఖరీదైనా మిర్చి విత్తనాలు కొనుగోలుచేసి ఇదే మండలంలో గోదావరి పక్కనే సురక్షిత ప్రాంతాల్లో నారు పెంపకంలో నిమగ్నమయ్యారు. ఈ విధంగా ఇప్పటికే నారుమళ్లు మొలిపించడంతోపాటు సస్యరక్షణా చర్యలు చేయనారంభించారు. ఈ సంవత్సరం ప్రత్తి పంట స్వల్పంగా సాగుచేసి, మిగిలిన పొలాల్లో మిరప పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు.