పశ్చిమగోదావరి

దేశ ప్రయోజనాల కోసమే నదుల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఆగస్టు 12 : దేశ ప్రయోజనాల దృష్ట్యా నదుల అనుసంధానానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని జల వనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరు కె శ్రీనివాసరావు అన్నారు. కృష్ణా పుష్కరాలు జరుగుతున్న నేపధ్యంలో ప్రతీ రోజు ఒక్కొక్క శాఖతో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో చర్చా వేదికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై చర్చా వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ శ్రీనివాసరావు మాట్లాడుతూ నదుల అనుసంధానం వలన ఎక్కువ జల లభ్యత కలిగిన నదుల నుంచి తక్కువ లభ్యత కలిగిన నదులలోకి కృత్రిమ కాలువలు, జలాశయాలను నిర్మించడం ద్వారా నీటిని తరలిస్తారన్నారు. కరువు ప్రాంతాల్లో నీటి లభ్యత వలన సమతుల్యతను సాధించడమే కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు. సముద్రంలోకి వృధాగా పోతున్న మిగులు నదీ జలాలను సృజనాత్మకంగా వినియోగించుకోవచ్చునన్నారు. 35 మిలియన్ హెక్టార్లకు సాగునీటి ప్రయోజనాలను కల్పించవచ్చుననే అంచనా కూడా వేశామన్నారు. 25 మిలియన్ హెక్టార్లలో ఉపరితల సాగునీరు, 10 మిలియన్ హెక్టార్లలో భూగర్భ జలాల రీఛార్జీ ద్వారా ప్రస్తుతం వున్న సాంప్రదాయ సాగునీటి ప్రాజెక్టుల అంతిమ సాగునీటి ప్రయోజనాలను 140 మిలియన్ హెక్టార్ల నుంచి 175 మిలియన్ హెక్టార్ల వరకు అధికంగా పొందవచ్చునన్నారు. నదుల అనుసంధానం వలన ఈ ప్రయోజనాలే కాకుండా వరదల నియంత్రణ, జల రవాణా, నీటి పంపిణీ, మత్స్యపరిశ్రమ అభివృద్ధి, కాలుష్య నివారణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపిడివో డాక్టర్ ఎన్ ప్రకాశరావు, పోలవరం కుడికాలువ ఎస్ ఇ కె రాజు, ఇన్‌ఛార్జి సిపివో టి సురేష్‌కుమార్, గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ రంగారావు, ఎన్‌జివో సంఘ నాయకులు చోడగిరి శ్రీనివాస్, ఆర్ ఎస్ హరనాధ్, ఆర్ సతీష్‌కుమార్‌లు పాల్గొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కూడా నదుల అనుసంధానంపై వివరించారు.