యువ

కిక్ ఇచ్చిన ఐడియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా...ఒక్క ఐడియాతో కొన్ని జీవితాలకు మహర్దశ పడుతుంది. ఆ ఐడియా రావడమే కష్టం. వచ్చాక దానిని అమలు చేస్తే వచ్చే ఫలితం...అదిచ్చే కిక్కు వేరు. ఆ మజా ఎలా ఉంటుందో హైదరాబాద్‌కు చెందిన మిత్రత్రయం -డాక్టర్ చంద్రశేఖర్, శివ, సునీల్ కుమార్‌లకు ఇప్పుడు అనుభవైకవేద్యమైంది.
చంద్రశేఖర్ వయసు 30పైన. ఆయన మిత్రులు శివ, సునీల్ వయసు 40 దాటింది. శివ, సునీల్ అమెరికాలో చక్కటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ డెంటిస్ట్. హైదరాబాద్‌లో ఓరల్, మాక్సిల్లోఫేషియల్ సర్జన్‌గా ఆయన బిజీ బిజీ. శివ, సునీల్ సిబిఐటిలో బిటెక్ చదువుతున్నప్పటినుంచీ ఫ్రెండ్స్. వారికి ఆ తర్వాత చంద్రశేఖర్‌తో పరిచయమైంది. ఈ ముగ్గురూ కలసి రెండేళ్ల కిందట ‘మై డెంటిస్ట్ ఛాయిస్’ అనే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మొదలుపెట్టారు. ఈ మిత్రత్రయం ఇటీవల టి-హబ్‌ను ఆశ్రయించింది. అంతే...వారి పంట పండింది. అమెరికాకు చెందిన ఓ కంపెనీకి ఈ స్నేహితుల ఆలోచన నచ్చి కోటి రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ మిత్రుల ఆనందానికి అంతు లేదు.
వాస్తవానికి దంత వైద్యం చదవడం తేలికేమో గానీ, ఆ తర్వాత ప్రాక్టీస్ పెట్టడం సవాల్‌తో కూడుకున్న పని. ఎందుకంటే డెంటిస్ట్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టేవారికి విలువైన పరికరాలు అవసరం. ఇందులో మధ్యదళారీలదే కీలకపాత్ర. దీంతో ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఈ సమస్యను గుర్తించిన మిత్రులు ముగ్గురూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా డెంటిస్ట్‌లకు అవసరమైన పరికరాలకు సంబంధించిన చేయూతను అందించడమే లక్ష్యంగా మై డెంటిస్ట్ ఛాయిస్‌ను మొదలుపెట్టారు. ‘మా ఇంట్లో అందరూ డాక్టర్లే. వారితో మా ఐడియాను పంచుకున్నప్పుడు వాళ్లెంతో ప్రోత్సహించారు. వాస్తవానికి సిటీలో ఉన్న డెంటిస్టులకంటే పట్టణాలు, పల్లెల్లో ప్రాక్టీస్ చేసే డెంటిస్టులకే మా అవసరం ఎక్కువ ఉంటుంది. వారికోసం శ్రమించడంలో ఎనలేని ఆనందమూ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు సునీల్.
కంపెనీ లాంచ్ చేశాక తొలి ఏడాది టర్నోవర్ 80 లక్షల రూపాయలు మాత్రమేనట. తాజాగా ఫండింగ్ లభించడంతో తమ వ్యాపారాన్ని మరింత విస్తరిద్దామన్న ఆలోచన ఉందని చెబుతున్నారు ఈ మిత్రులు. 40వ పడిలో కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టడం రిస్క్‌తో కూడుకున్న పనే అయినా అందులో విజయం సాధించడంతో తమ రిస్క్ వృథా కాలేదంటున్న ఈ మిత్రత్రయానికి ‘యువ’ బెస్ట్ఫా లక్ చెబుతోంది.
*