యువ

ఇంట్లోనే ఒళ్లు వంచుదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ వర్కవుట్స్ చేయాలనే ఉంటుంది అందరికీ! కానీ టైమే దొరకదు. అలాంటివారు హా యిగా ఇంట్లోనే చేసుకునే ఎక్సర్‌సైజులు బోలెడున్నాయి. వాటి గురించి తెలిస్తే చాలు. అలాంటివి కొన్ని....
బోట్ పోజ్
శరీరాన్ని పడవ తరహాలో వంచి, కేవలం పిరుదులపైనే బ్యాలెన్స్ చేయాలి. అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. దీనివల్ల వెనె్నముక పటిష్ఠంగా మారి, వెన్ను సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అలాగే నడుము భాగంలో పేరుకున్న కొవ్వు కూడా కరిగేందుకు ఈ భంగిమ దోహదపడుతుంది.
తీరైన నడుముకోసం
చిన్నప్పుడు అందరూ గుంజీలు తీసే ఉంటారు. అలాంటి ఎక్స్‌ర్‌సైజే ఇది. తీరైన కటి భాగం (నడు ము, పిరుదులు) కావాలనుకునే వారికి సరైన వ్యాయామమిది. నడుమును వెనక్కి జరిపి, చేతుల్ని ముందుకు చాపి, కింద కూర్చుని, మోకాళ్లపై నెమ్మదిగా లేవాలి. ఇలా రోజూ కొద్దిసేపు చేస్తే తీరైన నడుము మీ సొంతం.
సైడ్ ప్లాంక్
ఛాతీ, నడుము బలంగా తయారయ్యేందుకు ఉపయోగపడే ఎక్సర్‌సైజ్ ఇది. ఫోటోలో చూస్తున్నట్టుగా ఒక చేతిని నేలకు ఆనించి, కాళ్లపై శరీరాన్ని పైకి లేపి, కొద్దిసేపు అదే భంగిమలో ఉండాలి. తేలికపాటి ఈ వ్యాయామాన్ని వామప్ ఎక్స్‌ర్‌సైజ్‌గా చేయడం మంచిది.
త్రికోణాసనం
నాజూకైన, బలిష్టమైన కాళ్లకోసం ఈ ఎక్స్‌ర్‌సైజ్‌ను ఎంచుకోవచ్చు. ఎడమకాలును ముందుకుచాపి, నడుమును ముందుకు వంచి, చేతుల్ని వె నక్కు పెట్టి కాసేపు అలానే ఉండాలి. ఇలా నాలుగైదుసార్లు చేస్తే మంచి ఫలితముంటుంది. *