యువ

టాక్సీలకు ‘కళ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాక్సీ ఫ్యాబ్రిక్...ముంబాయిలో టాక్సీ ఎక్కిన వారిని అశ్చర్యపరుస్తున్న కళ ఇది. ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసినట్టుగానే కార్లకూ చేయొచ్చు. సీట్ కవర్లకే అద్భుతమైన డిజైన్లు వేయడాన్ని ఎంచుకుని స్థానిక కళాకారులను ప్రోత్సహించడం ధ్యేయంగా మొదలైన టాక్సీ ఫ్యాబ్రిక్‌కి ఇప్పుడు ఆదరణ లభిస్తోంది. సంకేత్ అవ్లానీ, మహక్ మాలిక్, నథాలీ గార్డన్, అమేయ కదమ్, వినీత్ భట్, సుశాంత్ కదమ్, గిరీశ్ నారాయణ్ వంటి కొందరు కళాకారులు, ఫొటోగ్రాఫర్ల ఆలోచనలోంచి పుట్టినదే ఈ టాక్సీ ఫ్యాబ్రిక్.
ఈ బృందం ముందుగా టాక్సీ ఓనర్లనుంచి ఆర్డర్లను తీసుకుని, వారికి నచ్చినట్టుగా, ప్రయాణికులు మెచ్చే విధంగా ఫ్యాబ్రిక్ డిజైన్ చేసి ఇవ్వడం వీరి పని. అద్దె టాక్సీలకు పేరొందిన ముంబాయిలో ఇప్పుడిప్పుడే టాక్సీ ఫ్యాబ్రిక్ డిజైన్ ఊపందుకుంటోంది.
*