యువ

ఇంధనవంతులు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీటరు పెట్రోల్ ధర రూ. 70 రూపాయలు
కిలోమీటర్‌కు రూపాయిపైనే ఖర్చవుతుంటే ఈ ధర టూవీలర్స్‌కు కూడా గిట్టుబాటు కాదు. బండి బయటకు తీయాలంటేనే భయం వేసే రోజులు దాపురించాయని తిట్టుకుంటూ బస్సులు పట్టుకుని వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు.
అదే...కిలోమీటర్‌కు 50 పైసలు మాత్రమే ఖర్చయ్యే సరికొత్త ఇంధనాన్ని ఎవరైనా కనిపెడితే..?
అంతకంటేనా అంటూ ఎగిరి గంతేసి బండిని బయటకు తీసి, జామ్మంటూ రోడ్లపై వీర ‘విహారం’ చేయమూ?
హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న ఐదుగురు కుర్రాళ్లు అదే పని చేశారు మరి. తీరిక సమయాల్లో అంతా కలసి ఆలోచించి ఓ ఇంధనాన్ని కనిపెట్టారు. టూ వీలర్‌లో ఆ ఇంధనాన్ని నింపితే కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు 50 పైసలు మాత్రమే!
అసలు విషయానికొస్తే....హైదరాబాద్‌లోని లా ర్డ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫరాజ్ అలీ, అబ్దుల్ సమీ, షాజెర్ బారి, రషీద్, తారిఖ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. పెట్రోల్ ధరలు దిగినట్టే దిగి మళ్లీ ఆకాశాన్నంటుకోవడం వారిని ఆలోచనలు రేకెత్తించింది. దీనికి ప్రత్యామ్నాయం కనిపెట్టాలని నిర్ణయించుకున్న ఆ ఐదుగురూ రోజూ కొంత సమయాన్ని కేటాయించి, కొత్త ఇంధనాన్ని కనిపెట్టే దిశగా ఆలోచన సాగించారు. చివరకు ‘ఎసిటిలీన్’ను కనిపెట్టారు. ‘ప్రత్యేకంగా తయారు చేసిన ట్యాంక్‌లో లైమ్‌స్టోన్ (సున్నపురాయి)ని, నీటితో కలిపితే ఓ విధమైన వాయువు వెలువడుతుంది. ఈ వాయువును కార్బొరేటర్‌లోకి పంపితే బండి నడుస్తుంది. యాక్సిలేటర్‌ను రైజ్ చేసిన ప్రతిసారీ రసాయనిక చర్య జరిగి బండి ముందుకు కదుల్తుంది’ అంటూ వివరించాడు ఫరాజ్ అలీ. అతను ఈ బృందానికి కెప్టెన్. ఎసిటిలీన్‌నే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తే అదయితే కేజీ 40 రూపాయలకే దొరుకుతుందనీ, వినియోగదారుడిపై భారం పడదనీ బృందంలోని మరో సభ్యుడు షాజెర్ చె ప్పాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు తమకైన ఖర్చు కేవలం 1500 రూపాయలని, ట్యాం కును ప్రత్యేకంగా తయారు చేయించినందుకు వెయ్యి రూపాయలైతే, ఇతర ఖర్చులు మరో 500 అయ్యాయని తెలిపాడు.
ఈ బృందం ప్రస్తుతం తమ అనే్వషణకు పేటెంట్‌కోసం దరఖాస్తు చేసింది. అది వచ్చాక ఆటోమొబైల్ కంపెనీలను కలసి తమ ప్రాజెక్టును వివరించే ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉంది. విద్యార్థి దశలోనే వినూత్నమైన ప్రయోగాలతో సమాజానికి సేవ చేయాలని సంకల్పించిన ఈ బృందానికి ‘యువ’ అభినందనలు తెలుపుతోంది.
*