యువ

ముస్త్ ఫా.. ముస్త్ ఫా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనకింత చేసిన ఊరికి మనం కూడా ఏదైనా చేయాలిగా...లేకపోతే లావై పోతాం’’
ఈ ఏడాది బంపర్ హిట్ కొట్టిన ‘శ్రీమంతుడు’ లోనిదీ డైలాగ్. ఈ సినిమా రాకముందే, ఈ డైలాగ్ చెవిన పడకముందే పదేళ్ల కిందటే ఇలాగే అనుకున్నాడో కుర్రాడు. అతని పేరు పిసి ముస్త్ఫా. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో చదివి, మోటోరోలా, సిటీ బ్యాంక్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేసి, యుకెలో కొంతకాలం నివసించిన ముస్త్ ఫా, వాటన్నింటినీ క్షణాల్లో వదలిపెట్టేశాడు. తనని ఇంతవా ణ్ని చేసిన మాతృదేశానికి ఏదో చేయాలిగా అనుకున్నాడు. పెట్టేబేడా సర్దుకుని వెనక్కి వచ్చేశాడు. వచ్చి... 34 ఏళ్ల వయసులో ఇడ్లీ, దోశ వ్యా పారం మొదలు పెట్టాడు. ఎనిమిదేళ్లు తిరిగేసరిగి వంద కోట్ల విలువైన వ్యాపారంగా మార్చేశాడు. స్ఫూర్తిదాయకమైన ముస్త్ ఫా ప్రస్థానం ‘యువ’ పాఠకులకు ప్రత్యేకం.
***
గ్రామీణ వాతావరణంనుంచి పైకొచ్చిన ముస్త్ఫాకు అక్కడి యువత పట్ల సరైన, సమగ్రమైన అవగాహన ఉంది. తన సంస్థలోకి గ్రామీణ యువకులను మాత్రమే తీసుకుంటాడు. ముస్త్ ఫా తన తెలివితేటలతో వ్యాపారాన్ని విస్తృతం చేశాడు. పదేళ్లు తిరిగే సరికి ఐడి ఫ్రెష్ వంద కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఇప్పుడు
ఐడి ఫ్రెష్‌లో అక్షరాలా 1100మంది పనిచేస్తున్నారు. 2008లో కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో హోస్కోట్‌లో పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు. రోజుకు ఆరు లక్షల ఇడ్లీలకు కావలసిన పిండిని ఐడి ఫ్రెష్ విక్రయిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు బెంగళూరువాసులకు ఐడి ఫ్రెష్ పేరు చిరపరిచితం.
***
ముస్త్ఫా స్వస్థలం కేరళలోని వాయనాడ్ జిల్లాలో చెన్నలోడ్ అనే కుగ్రామం. తండ్రి కాఫీ తోటల్లో కూలీగా పనిచేసేవాడు. తల్లి ఫాతిమా కూడా నిరక్షరాస్యురాలే. కుటుంబంలో ముస్త్ ఫా పెద్దవాడు. అతనికి మరో ముగ్గురు చెల్లెళ్లున్నారు. మొదట్లో ముస్త్ఫా చదువు కూడా అంతంతమాత్రంగానే ఉండేది. ఆరో తరగతిలో ఫెయిలవడంతో చదువు మానిపించేద్దామని తండ్రి ఆలోచించాడు. కానీ ముస్త్ఫా కాళ్లావేళ్లా పడ్డాక కనికరించాడు. పరాజయం ముస్త్ఫాను తీవ్రంగా బాధించింది. పట్టుదలతో చదివి పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇంట్లోనూ, బయటా అతనిపై నమ్మకం పెరిగింది. మరింత బాగా చదివి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో సీటు తెచ్చుకున్నాడు. డిగ్రీ చేతిలో పడ్డాక పెద్ద పెద్ద కంపెనీలు అతన్ని వెదుక్కుంటూ వచ్చాయి. వాటిని అందిపుచ్చుకుని, దుబాయ్, లండన్‌లలో పనిచేశాడు. తర్వాత పుట్టిన ఊరిపైనా, కన్నవాళ్లపైనా ఆలోచనలు అతన్ని అక్కడ నిలవనివ్వలేదు. ఊరికోసం, దేశం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వెనక్కి వచ్చేశాడు.
వెనక్కయితే వచ్చేశాడు గానీ, ఏం చేయాలో పాలుపోయేది కాదు. అలాంటి దశలో ముస్త్ఫా ఐదుగురు కజిన్లలో ఒకడైన షంషుద్దీన్ ఓ సలహా ఇచ్చాడు- ఇడ్లీ, దోశ పిండి అమ్మితే ఎలా ఉంటుందని. అతని సలహాకి ముందు నవ్వొచ్చినా, తరువాత ఆలోచించాడు. మరింత ముందుకెళ్లి, నిశితంగా సర్వే చేశాడు. అప్పట్లో బెంగళూరులో ఇడ్లీ, దోశకు డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేదన్న సంగతిని గ్రహించాడు. వెంటనే ఐదుగురు కజిన్లతో కలసి 25వేల రూపాయల పెట్టుబడితో నగరంలోని ఓ శివారు ప్రాంతంలో ఇడ్లీ, దోశ పిండి తయారీ మొదలుపెట్టాడు. తమ దుకాణానికి పేరేం పెట్టాలని ఆలోచిస్తుండగా ఓ కజిన్ ‘ఐడి (ఐ-ఇడ్లీ, డి- దోశ) ఫ్రెష్’ అని పేరు పెడితే ఎలా ఉంటుందన్నాడు. ఆ సలహా నచ్చి, అదే ఖాయం చేశాడు ముస్త్ఫా. ఇడ్లీ, దోశల పిండిని ఆర్డర్‌పై ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి, సప్లై చేయడమే వాళ్ల వ్యాపారం. మొదట్లో (2005లో) రోజుకి పది ప్యాకెట్లు అమ్మేవారు. క్రమంగా ముస్త్ఫా తన తెలివితేటలతో వ్యాపారాన్ని విస్తృతం చేశాడు. పదేళ్లు తిరిగే సరికి ఐడి ఫ్రెష్ వంద కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఇప్పుడు ఐడి ఫ్రెష్‌లో అక్షరాలా 1100మంది పనిచేస్తున్నారు. 2008లో కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో హోస్కోట్‌లో పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు. అమెరికానుంచి గ్రైండర్లను తెప్పించాడు. రోజుకు ఆరు లక్షల ఇడ్లీలకు కావలసిన పిండిని ఐడి ఫ్రెష్ విక్రయిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు బెంగళూరువాసులకు ఐడి ఫ్రెష్ పేరు చిరపరిచితం.
గ్రామీణ వాతావరణంనుంచి పైకొచ్చిన ముస్త్ఫాకు అక్కడి యువత పట్ల సరైన, సమగ్రమైన అవగాహన ఉంది. తన సంస్థలోకి గ్రామీణ యువకులను మాత్రమే తీసుకుంటాడు. ‘ఇంట్లో అహరహం కష్టపడే ఆడవారికి మేమే అసలు సిసలు మిత్రులం. మేం చేసిన పిండితో తయారు చేసిన ఇడ్లీలు బాగుంటే ఆ ఘనత ఆ ఇంటి ఇల్లాలికి దక్కుతుంది. ఇడ్లీ బాగోలేకపోతే ఆ చెడ్డపేరు మాకే వస్తుంది. కాబట్టి పిండి తయారీ విషయంలో మేం జాగ్రత్తగా ఉంటాం’ అనే ముస్త్ ఫా, ప్రతి రోజూ తన సంస్థలో తయారయ్యే ఆహార పదార్ధాలను మొట్టమొదటగా తన పిల్లలచేత తినిపిస్తాడు!