యువ

ఆచితూచి అడుగేస్తే విజయం మీ వెంటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువు ముగించి, ఉద్యోగం వేటలో పడిన యువతకు ముందడుగు ఎలా వేయాలనే విషయంలో ఎన్నో సంకోచాలు, అనుమానాలు ఉండటం సహజమే. ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలి, మన హావభావాలు ఎలా ఉండాలి వంటి విషయాలనుంచి ఉద్యోగంలో చేరాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి విషయాల వరకూ అనేక సందేహాలు. తాజాగా ‘వర్క్‌ప్లేస్ ట్రెండ్స్’ అనే సంస్థ జరిపిన ఓ సర్వేలో నేటి యువతకు వృత్తిగతంగానూ, వ్యక్తిగతంగానూ ఎంతో ఎదగాలనే కాంక్ష ఉందనీ, అయితే అనుభవం లేకపోవడమే వారిని కుంగదీస్తోందనీ పేర్కొంది. ఉద్యోగం సంపాదించడానికే కాదు, ఉద్యోగం వచ్చాక అంచెలంచెలుగా ఎదగడానికీ అనుభవమే అవసరం.
భావోద్వేగ పరిణతి
భావోద్వేగ పరిణతి అన్ని విషయాల్లోనూ అవసరమే. ముఖ్యంగా ఎదుటివారితో వ్యవహరించేటప్పుడు ఇది మరీ అవసరం. ఇది కాలేజీల్లో నేర్పే విద్య కాదు. ఇతరులను చూసి నేర్చుకోవాల్సిందే. మరో మాటలో చెప్పాలంటే పరిశీలనతో అబ్బే విద్య. ఇంటర్వ్యూల్లోనూ, ఆఫీసులో పైఉద్యోగులతో మాట్లాడేటప్పుడు భావోద్వేగ పరిణతి మరీ ముఖ్యం.
కొంతవరకే వ్యక్తిగతం
సహోద్యోగులతో సన్నిహితంగా ఉంటూ, వారి మన్ననలు చూరగొనాలనుకోవడం తప్పేం కాదు. కానీ, దానికీ ఓ పరిమితి ఉంది. ఎదుటివారి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడంలోనూ, మన వ్యక్తిగత విషయాలను ఎదుటివారితో పంచుకోవడంలోనూ కొన్ని పరిమితులు పాటించాల్సిందే. ముఖ్యంగా రాజకీయాలు, కులమతాలు వంటి అంశాలకు సంబంధించి ఆచితూచి మాట్లాడటమే శ్రేయస్కరం.
బాస్‌లతో బహుపరాక్
బాస్‌లకు సన్నిహితంగా ఉంటూ, వారినుంచి నేర్చుకోవాలన్న తపన మంచిదే. వారి మనసులో ఏముందో ముందుగానే పసిగట్టి, ఆ పనిని నెరవేర్చడం ద్వారా మంచి మార్కులు కొట్టేయాలనుకోవడం వృత్తిరీత్యా ఎదగాలనుకునేవారికి తప్పేం కాదు. కానీ, బాస్‌లతో సన్నిహితంగా ఉండే క్రమంలో సహచరులకు దూరమయ్యే ప్రమాదం ఉంటుందేమో ఆలోచించాలి. *