యువ

అతని దారి రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై తిరగడం బాగానే ఉంటుంది.
అదే మోటార్ సైకిల్‌పై దేశాన్ని చుట్టిరమ్మంటే మాత్రం ‘అమ్మో మా వల్లకాదు’ అనేస్తాం.
కానీ రోహిత్ సుబ్రమణియన్ లక్ష్యమే అది. దేశానే్న కాదు...ప్రపంచంలోని 194 దేశాలనూ చుట్టివస్తానంటాడు.
చెన్నైకి చెందిన రోహిత్ వయసు 22 ఏళ్లు. గత 150 రోజులుగా దేశాటనలో ఉన్న రోహిత్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నాడు. ఆయన చిట్ట చివరి మజిలీ చెన్నై. ఇప్పటికి 31,900 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన రోహిత్‌కు బైక్ రైడింగ్ అంటే ఇష్టం. భిన్నమైన మనుషుల్ని, వారి మనస్తత్వాలను, విభిన్నమైన సంస్కృతులను అవగాహన చేసుకోవాలంటే క్రాస్ కంట్రీ రైడింగ్‌ను మించినది లేదంటాడు.
చిన్నప్పుడు పత్రికలో వచ్చిన వార్తాకథనం ఒకటి తనమీద బాగా ప్రభావం చూపించిందంటాడు. అమెరికాకు చెం దిన 40 ఏళ్ల వ్యక్తి గురించిన ఆ కథనంలో అతను జీవితమం తా తప్పులు చేస్తూ, పశ్చాత్తాపపడుతూ బతకడంతోనే సరిపోతుందట. తన జీవితం అలా కాకూడదని, విభిన్నంగా, పదిమందికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ లైన్‌ను ఎంచుకున్నానని చెబుతాడు.
రోజుకి ఎనిమిది గంటలపాటు బైక్ నడిపే రోహిత్, మరో నాలుగైదు గంటలు స్థానికంగా ఉండే ప్రజలతో మమేకమై, వారి జీవన స్థితిగతుల గురించి, అక్కడి సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు వెచ్చిస్తాడట. మరో విశేషమేమంటే, అతను ఎప్పుడూ హోటల్స్ ఉండకపోవడం. సోషల్ మీడియాలో తనకు పరిచయమైన స్థానికులే తనను ఇంటికి ఆహ్వానిస్తారని, అది వీలుకానప్పుడు పోలీస్ స్టేషన్లలోనో, రైల్వే స్టేషన్లలోనో పడుకుంటానని చెబుతాడు. తన ఒంటరి ప్రయాణంలో ఎన్నో అవాంతరాలూ, అడ్డంకులూ కూడా ఎదురవుతూ ఉంటాయట. ఓసారి కాశ్మీర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు మంచు పెళ్లలు విరిగి పడి రోడ్డు మూసుకుపోయిందట. దారి కనుక్కుని వెళ్లడానికి నానా అవస్థలూ పడాల్సి వచ్చిందట. డబ్బులకోసం ఎవరిమీదా ఆధారపడటం ఇష్టం లేదని చెప్పే రోహిత్, అవసరమైతే టీ అమ్మేందుకు, పెట్రోల్ పంపుల్లో పనిచేసేందుకు కూడా వెనుకాడడు.
పర్యటన ఎప్పుడూ ప్రణాళికాబద్ధంగా ఉండకూడదనేది రోహిత్ నమ్మకం. అలా ఉంటే అది విహారయాత్ర అవుతుంది తప్పితే పర్యటన ఎందుకవుతుందని ఎదురు ప్రశ్నిస్తాడు. టూర్ ప్లాన్ లేకపోతే ప్రతి రోజూ పర్యటన కొత్తరకంగా ఉంటుందంటాడు.
భారత పర్యటన ముగిసిన తర్వాత యూరోప్ పర్యటనకు బయల్దేరతానంటున్న రోహిత్, ప్రపంచంలోని 194 దేశాలనూ చుట్టిరావడం లక్ష్యమంటాడు.
*