యువ

కాళ్ల కింద కారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెళ్లాల్సిన ప్రదేశం దగ్గర్లోనే ఉండొచ్చు..కానీ కారో, టూవీలరో బయటకు తీస్తాం. దానివల్ల పెట్రోల్ వృథా..అంతకుమించి కాలుష్యం బెడద. మరేం చేయడం? బుద్ధిగా నడచి వెళ్లడం ఒంటికి మంచిది. అలా వెళ్లలేని వారు మాత్రం వాక్ కార్‌ను ట్రై చేయొచ్చు. చూడటానికి ఇదో హోవర్ బోర్డ్‌లా ఉంటుంది. ఫొటోలో చూస్తున్నారుగా...దీనికి స్టీరింగ్‌లాంటివేమీ ఉండవు. దీనిమీద నిలబడి మీరు ఎటు వైపు వంగితే ఆ వైపుకు తిరుగుతుంది. గంటకు ఆరు మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. వాక్ కార్ కింద అమర్చిన శక్తిమంతమైన బ్యాటరీలను ఒకసారి చార్జ్ చేస్తే ఏడు గంటలు నిర్విరామంగా పనిచేస్తాయి. కొకోవా మోటార్స్ కంపెనీ దీనిని మార్కెట్ చేస్తోంది.