యువ

ఫిట్‌నెస్... అతని బిజినెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా అంబానీలు, బిర్లాల వెంట పడుతుంటే, అంబానీలు, బిర్లాలు మాత్రం వినోద్ చన్నా వెంటపడతారు.
అమ్మాయిలు, అబ్బాయిలూ బాలీవుడ్ హీరో హీరోయిన్ల వెంట పడుతుంటే, ఆ సెలబ్రిటీలు మాత్రం వినోద్ చన్నా వెంట పడుతుంటారు.
అంతెందుకు....జాన్ అబ్రహాం, రితేశ్ దేశ్‌ముఖ్, శిల్పాశెట్టి, హర్షవర్థన్ రాణె వంటి బాలీవుడ్ సెలబ్రిటీలంతా అతనికి అభిమానులే.
ఆ లిస్టులోకి తాజాగా ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ కూడా చేరాడు.
ఇంతకీ ఎవరీ వినోద్ చన్నా?
వినోద్...ఓ ఫిట్నెస్ ట్రెయినర్. అంతకుమించి...ముంబయిలో సెటిలైన తెలుగువాడు!
బరువు తగ్గాలనుకునే అనంత్ అంబానీలాంటివారికీ, సిక్స్ ప్యాక్‌లు పెంచాలనుకునే బాలీవుడ్ సెలబ్రిటీలకూ అతనే దిక్కు. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన శిల్పాశెట్టికీ అతనే గురువు. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డాక కూడా ఆమె వినోద్‌తో స్నేహాన్ని వదులుకోలేదు. ప్రసవానంతరం బరువు పెరిగితే మళ్లీ వినోదే దిక్కయ్యాడామెకు. ఫిట్‌నెస్ ట్రెయినింగ్‌లో వినోద్‌కు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఈ రంగంలోకి పదహారో ఏటే అడుగుపెట్టాడు. ‘మరీ అంత తొందరగానా?’ అని ప్రశ్నిస్తే...దాని వెనుక బోలెడు కథ ఉందంటాడు వినోద్. చిన్నప్పుడు వినోద్ బాగా సన్నగా ఉండేవాడట. స్నేహితులంతా బక్కగా ఉన్నావంటూ ఏడిపించేవారట. దాంతో పనె్నండో ఏటే ఎక్సర్‌సైజులు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. కండలు పెంచాక, తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందంటాడు. వినోద్ పనితీరు చూసిన ఓ క్లయింట్, అతన్ని హీరో రితేశ్ దేశ్‌ముఖ్‌కు పరిచయం చేశాడు. ‘హౌస్‌ఫుల్’ సినిమాలో నటించేందుకు అంగీకరించిన రితేశ్, ఓ ఫిట్‌నెస్ ట్రెయినర్‌కోసం వెతుకుతున్నాడు. రితేశ్ రికమెండేషన్ మీద అతను పలువురు బాలీవుడ్ హీరోలకు ఫిట్‌నెస్ ట్రెయినర్‌గా మారాడు. కేవలం హీరోలు, హీరోయిన్లకే కాకుండా అనేకమంది క్రీడాకారులకూ వినోద్ సేవలు అందిస్తున్నాడు. ఇంతమంది సెలబ్రిటీలకు ట్రెయినర్‌గా వ్యవహరిస్తున్నా, అనంత్ అంబానీకి బరువు తగ్గడంలో సహాయ సహకారాలు అందించడం ద్వారా వినోద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఎవరో చెప్పగా అనంత్..వినోద్ దగ్గరకు వచ్చాడు. అప్పటికి అనంత్ బరువు 208 కేజీలు. వినోద్ సలహాలు, సూచనలు, శిక్షణ అనంతరం అనంత్ 100 కేజీలు తగ్గాడు. మీడియాలో అనంత్ ఫోటోలు చూసిన వారు ఆశ్చర్యపోయేంతగా మారాడు. ఈ మార్పుకు కారణం వినోద్ అని తెలియగానే సెర్చ్ ఇంజన్లలో వినోద్ చన్నా పేరును సెర్చ్ చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. అయితే అనంత్ బరువు తగ్గడంలో తన పాత్ర పరిమితమేనని, అనంత్ పట్టుదలే అందుకు కారణమని చెబుతాడు వినోద్. ‘అనంత్ ఆహారపు అలవాట్లే అతను బరువు పెరగడానికి కారణం. నేను వాటిని మార్చాను. అలాగే వ్యాయామాన్ని అతని దినచర్యలో భాగం చేశాను. అంతే...మార్పేమిటో మీరే చూశారు’ అంటాడతను.
ప్రస్తుతం ‘డిషూమ్’ సినిమాకోసం జాన్ అబ్రహాంకు శిక్షణ ఇస్తున్న వినోద్, ఈ కాలపు అబ్బాయిలు సిక్స్‌ప్యాక్ కోసం తహతహలాడుతున్నారని, అది అందరికీ సాధ్యం కాదని అంటాడు. జీన్స్, వైద్య చరిత్ర, జీవక్రియ వంటివాటిని పరిగణనలోకి తీసుకుని శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని, కొంతమందికి కండరాలు చిటికెలో పెరుగుతాయని, మరికొందరికి ఎంతో సమయం పడుతుందని చెబుతాడు. కొందరు కండలు బాగా పెంచినా, చురుగ్గా కదల్లేరని, పరుగెత్తడం, దూకడం వంటివి వారికి సాధ్యం కావని, దీనికి కారణం వారిలో స్టామినా లేకపోవడమేనని వినోద్ వివరిస్తాడు.ణంగా వాటి తయారీలో మునిగి తేలుతున్నాయి. అలాంటి వాటి గురించిన కథా...కమామీషు మీకోసం..!

చిత్రాలు.. శిల్పాశెట్టి, జాన్ అబ్రహాంతో వినోద్ చన్నా