యువ

అరచేతిలో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలుష్యం పెచ్చుమీరిపోతున్న ఈ రోజుల్లో ఏం తినాలన్నా భయంగానే ఉంది. పండ్లు తినాలంటే ఎక్కడ కృత్రిమ రసాయనాలతో మగ్గబెడుతున్నారోననే భయం. కూరగాయలు కొనాలంటే పురుగు మందుల ప్రభావం ఉంటుందేమోనని బెంగ. ఇక జంక్‌ఫుడ్ సంగతి సరేసరి. అయితే ఇప్పుడిక ఇలాంటి బెంగలు, భయాలు అక్కర్లేదు. ఎందుకంటే...ఏ ఆహార పదార్థంలో ఎంత శాతం కొవ్వులు, ప్రొటీన్లు, చక్కెర ఉన్నాయో లెక్కగట్టి చెప్పే గాడ్జెట్ వచ్చేసింది. దాని పేరు- సియో స్కానర్ (డషజ్య ఒష్ఘశశళూ). అరచేతిలో పట్టే ఈ స్కానర్ దగ్గరుంటే రోగాలు పరారే! ఉదాహరణకు మీరో యాపిల్ కొన్నారనుకోండి. ఈ బుల్లి పరికరాన్ని యాపిల్ ముందుంచి, పైన ఉన్న బటన్ నొక్కండి. అంతే, ఆ యాపిల్‌లో ఉన్న చక్కెర శాతమెంతో, రసాయనాలు ఏవైనా కలిస్తే వాటి శాతమెంతే లెక్కగట్టి మీ స్మార్ట్ఫోన్‌కు డేటా పంపించేస్తుంది! కేవలం పండ్లకు మాత్రమే కాదు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ సంగతి కూడా ఈ సియో స్కానర్ తేల్చేస్తుందట. దీని ధర 249 డాలర్లు.