యువ

స్మార్ట్ ఫోన్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర దేశాలకంటే ఇండియాలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా సాగిపోతున్నాయట. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జరిగిన అమ్మకాలనే నిపుణులు ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇతర దేశాల్లో మూడు శాతమే ఉన్న అమ్మకాలు ఇండియాలో మాత్రం 15శాతంగా నమోదయ్యాయట. అందులోనూ 3జి, 4జి స్మార్ట్ ఫోన్లంటే భారతీయులు మక్కువ చూపిస్తున్నారని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ చెబుతోంది. ఎల్టీఇ స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 264 శాతం వృద్ధి ఉందంటే మనవాళ్ల కొనుగోలు శక్తి ఏపాటిదో అర్థమవుతోంది కదూ! కాగా చౌకగా లభించే చైనా ఫోన్లంటే కూడా ఇండియన్స్ ఎగబడి కొంటున్నారని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అనలిస్ట్ కరన్ చౌహాన్ అంటున్నారు. పైగా ఇండియాలో జరుగుతున్న అమ్మకాల్లో చైనా ఫోన్ల వాటా 27శాతంగా ఉందట. లెనోవో, వివో, అప్పో, జియామీ, లెఎకో వంటి ఫోన్ల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందంటున్నారు కరణ్. మరోవైపు స్మార్ట్ఫోన్ల తయారీ విషయంలో ప్రధాని ‘మేకిన్ ఇండియా’ పిలుపు ప్రభావమూ బాగానే ఉందట. గతంలో ఇండియాలో 10 బ్రాండ్లు వరకూ తయారైతే, ఇప్పుడు ఆ సంఖ్య 35కు చేరుకోవడం గమనార్హం.