యువ

డీలా పడకు.. డీల్ చెయ్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదులుదెబ్బలు..అందరికీ సహజం. వాటిని తట్టుకుని నిలబడటమే జీవితం. పని వత్తిళ్లూ నేటి చికాకుల మయమైన ప్రపంచంలో సహజం. నిరాశ నిస్పృహలకు లోనుకాకుండా..నిస్తేజం..నిట్టూర్పులు వ్యక్తిత్వాన్ని మింగేయకుండా ముందుకు సాగడంలోనే ఆనందం ఉంది. అందులోనే మనం ఎంచుకున్న లక్షసాధనా మార్గమూ ఉంటుంది.మనం చేయాలనుకున్న పని చేయలేక పోయినా..అది అందినట్టే అంది చేజారినా..ఒకరకమైన నిస్తేజం ప్రతి ఒక్కరినీ ఆవహిస్తుంది. ఇది శ్రుతి మించి పోతే..మనమీద మనకే నమ్మకం లేని..ఏ పనీ ధైర్యంగా చేయలేని నిరాశామయ పరిస్థితికీ దారితీస్తుంది. ఇలాంటి వైఫల్యాలు, తృటిలో తప్పిన విజయాలు, ఒక్క మార్కులో పరీక్ష పోవడాలూ అందరికీ అనుభవైక వేద్యం. మరి వాటిలోనే కొట్టు మిట్టాడిపోతే..తదుపరి అడుగేయడానికే భయపడి పోతే..మానవ జీవనం ముందు సాగదు. వైఫల్యంలోనే విజయం ఉంటుంది. ఆ విజయం ఎలా సిద్ధిస్తుంది? అందుకు ఎంచుకోవాల్సిన మార్గం ఏమిటి? నిరాశను పారదోలి..నిస్పృహను తరిమికొట్టి వాటి స్థానే ఆశలకు, ఆకాంక్షలకు ఎలా ఉద్దీపన ఇవ్వాలి? అలాగే మనం చేస్తున్న పనిమీద ఎలాంటి అన్యప్రభావం లేకుండా ఏకాగ్రతను పెంపొందించుకోవాలన్నది అసాధ్యమేమీ కాదు కానీ కష్ట సాధ్యం. ఇందుకు అవసరమైన రీతిలో మనం మానసికంగానూ, శారీరకంగానూ, బయటి ప్రపంచంతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నిరాశను జయించి విజయాలను సొంతం చేసుకోవాలంటే ముందుగా అన్ని రకాల వత్తిళ్ల నుంచి బయట పడాల్సి ఉంటుంది. చాలా వరకూ మన వైఫల్యాలు స్వయం కృతాలే అవుతాయి. తగిన ప్రణాళిక లేకపోవడం, తగిన విధంగా ముందస్తు వ్యూహాన్ని రూపొందించుకోక పోవడం, అన్నింటికీ మించి మనం చేయబోయే పని ప్రాధాన్యతను అతిగా ఊహించుకోవడమో లేదా దాన్ని తక్కువగా అంచనా వేయడం వంటివి వైఫల్యాలకు దారితీస్తాయి. అలాగే అనవసరమైన టెన్షన్లకూ కారణమవుతాయి. విద్యా రంగం మొదలుకుని అతి పెద్ద వ్యాపారం వరకూ ఏదైనా కూడా పోటీని తట్టుకుని నిలబడాల్సిందే. ఒకసారి చేజారిన అవకాశం మళ్లీచేతికందడం ఎప్పుడో తెలియని పరిస్థితి అన్ని రంగాల్లోనూ ఉంది. ఎక్కువ మార్కులు సంపాదించాలని విద్యార్థులు పోటీ పడితే..ఇతర స్కూళ్ల కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలని విద్యా సంస్థలూ పోటీ పడతాయి. ఇక వ్యాపార ప్రపంచం గురించి చెప్పనే అక్కర లేదు. ఎందుకంటే ఉత్పత్తిలోనూ, ఉత్పాదకతలోనూ అరితేరితే తప్ప..మారుతున్న కాలానికి అనుగుణంగా రాటుదేలితే తప్ప రాణించే అవకాశం ఉండదు. ఎలాంటి పరిస్థితులెదురైనా వాటిని తట్టుకోగలిగితేనే మనం ముందుకు వెళ్లగలుగుతాం. ఇందుకు ఏమి చేయాలన్నది మన విజ్ఞతను బట్టి, ఆలోచనను బట్టి..ఎలాంటి వత్తిళ్లకు లోనుకాకుండా తీరిగ్గా పరిస్థితుల్ని విశే్లషించి తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. అందుకు ప్రధానంగా కావాల్సింది వత్తిళ్ల నుంచి బయట పడటం. ఉద్యోగులు యాజమాన్యాలు, విద్యార్థులు, విద్యా సంస్థలు తమ అవసరాలు,పరిస్థితులు, సవాళ్లను బేరీజు వేసుకుని తదనుగుణంగా వ్యవహరించగలిగితే సమస్యలు పటాపంచలవుతాయి. సునాయాసంగానే లక్ష్యానికి చేరువయ్యే అవకాశాలు మెరుగవుతాయి. ఇందుకు వాస్తవిక దృక్పథం..సమస్య లోతుపాతుల్ని పరికించగలితే విశే్లషణ, వివేచన కావాలి. కొందరిని సమస్యల్ని కొనితెచ్చుకునే ధోరణి ఇంకొందరిది..అవి తలెత్తకుండా నివారించగలిగే దూరదృష్టి..విజయానికి, అపజయానికీ ఉన్న తేడా కూడా ఇదే. దీన్ని గ్రహించగితే..మనం సమస్యల్ని ఆహ్వానిస్తున్నామా లేక వాటికి ఆస్కారం లేకుండా చేస్తున్నామా అన్న స్పృహను నిరంతరం కనబరచగలిగితే అపజయం దరిచేరదు. విజయమూ చేజారదు!

-బి.సుధ