యువ

ఆటగాళ్ల కోసం ఓ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మార్నింగ్ వాక్’తో మానసిక ప్రశాంతతే కాదు, ఒక్కోసారి మంచి ఆలోచనలు అక్షరరూపం రూపుదిద్దుకుంటాయని హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవిరళ్ విషయంలో నిజమైంది. ఈ మధ్య ఓ రోజు అతను మార్నింగ్ వాక్‌లో ఉండగా- రియో ఒలింపిక్స్‌లో భారతీయ ఆటగాళ్ల నైపుణ్యం ఎలా ఉంటుందోనని అదేపనిగా ఆలోచించాడు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని ఆరాటపడే మన ఆటగాళ్ల కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించాడు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా అతనిలో ఓ సంగీతకారుడు, ఓ గీతరచయిత ఉన్నారు. అందుకే ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లు అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఓ అద్భుత గీతం రాశాడు. తన పాట భారత ఆటగాళ్ల వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుందని అవిరళ్ అంటున్నాడు. తన ఆలోచనలకు, అందమైన పదాలకు మెరుగులు దిద్ది- ‘ సోనే కీ మొహర్ చాహే.. దిల్ కీ జమీన్’ అంటూ భావోద్వేగంతో ఓ గీతాన్ని ఆవిష్కరించాడు. పాట రాస్తే సరిపోదని, దానికి అనువైన దృశ్యరూపం అందించాలని తనతోపాటే పనిచేస్తున్న వాసంతి వుక్కెం సహాయం తీసుకున్నాడు. కర్నాటక సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వాసంతి స్వరరచనలో- అవిరళ్ రాసిన పాట వీడియోగా రూపుదిద్దుకుని ‘ఫేస్‌బుక్’లో ఇపుడు వీక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల ఆకాంక్షలను, వారి అంతరంగాల్ని ఆ పాట చెప్పకనే చెబుతోంది. పాట రాయడం, పాడడం కన్నా దాన్ని వీడియో రూపంలో సమర్పించడం అంత సులువేమీ కాదని అవిరళ్ తన అనుభవాన్ని వివరిస్తున్నాడు. భారతీయ క్రీడాకారుల కోసం రాసిన పాటను ‘అంతర్జాల వేదిక’పై ఉంచడంలో కొంత శ్రమపడినప్పటికీ, ‘ఫేస్‌బుక్’లో మంచి స్పందన రావడంతో తమ కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని భావిస్తున్నట్లు వాసంతి చెబుతున్నారు. నెటిజన్ల ఆదరణ తమను సంతోషపరచినప్పటికీ, ఆ వీడియోను చూసి ప్రధాని నరేంద్ర మోదీ తమను అభినందించాలని ఈ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కోరుకుంటున్నారు.